సహనమే ఆయుధం
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ
మలప్పురం(కేరళ): వివాదరహిత సమాజ నిర్మాణంలో సహనమే ప్రధాన ఆయుధమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ స్పష్టంచేశారు. మతాల మధ్య అంతరాలను తొలగిస్తే అసహనం అనేది ఉండదన్నారు. భిన్నత్వం కలిగి ఉన్న మన సమాజంలో సహనంతో దేన్నైనా స్వీకరించే, అన్ని మతాలను అర్థం చేసుకునేతత్వాన్ని ప్రజల్లో పెంపొందిచాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారమిక్కడ ‘అసహనం’పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మతాల మధ్య ఘర్షణ నివారణకు సహనం.. ధర్మం, స్వేచ్ఛలా పనిచేస్తుందన్నారు.