
పీవీ మంచి చేశారు.. చెడూ చేశారు!: అన్సారీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన విధానాలతో దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కొనియాడారు. 1991లో ఆర్థిక వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు దేశాన్ని మార్చివేశాయన్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల ప్రతికూల పర్యవసానాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను నిలువరించడంలో విఫలమయ్యారని, అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇంకా దేశాన్ని వీడలేదన్నారు. వినయ్ సీతాపతి రచించిన‘హాఫ్ లయన్-హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్‌ఫామ్డ్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభలో అన్సారీ మాట్లాడారు.