ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారు
పీవీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు దేశ ఆర్థికప్రగతిని పరుగులు పెట్టించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన తెచి్చన ఎన్నో సంస్కరణలు నేటికీ ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. పీవీ 103వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డిలతో కలసి రేవంత్ పీవీ చిత్రపటానికి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెచ్చి విద్యను అన్నివర్గా ల వారికి అందించిన వ్యక్తి పీవీ అన్నారు. ప్రధానిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమ న్నారు.
తెలంగాణ భవన్‌లో..
తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన పీవీ జయంతి కార్యక్రమానికి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు సంస్కరణలు తెచి్చన వ్యక్తి పీవీ అని భట్టి తెలిపారు. మంథని నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో పీవీ అనేక విద్యామార్పులు తెచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అనంతరం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, గోడెం నగేశ్, టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్, బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్.సురేశ్‌రెడ్డి, దివికొండ దామోదర్‌లు నివాళులరి్పంచారు.
ఆరుసార్లు మైక్ కట్.. మంత్రుల అసహనం
భట్టి ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయ్యింది. తొలుత సాంకేతికలోపం అనుకున్న భట్టికి మరో ఐదుపర్యాయాలు మైక్ కట్ అవ్వడం, మాట్లాడే మాట సరిగ్గా అర్థం కాకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఓ పక్క ఆడిటోరియంలో జనాలు లేక మరోపక్క మైక్ సమస్యతో తన ప్రసంగాన్ని మధ్యలో ముగించేసిన భట్టి సీఎం నివాసానికి వెళ్లిపోయారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడేటప్పుడు కూడా మైక్ కట్ అవ్వడంతో ఆయన కూడా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వేదికపై కూర్చున్నారు.కార్యక్రమం ముగిసిన వెంటనే కింద ఉన్న డిప్యూటీ కమిషనర్ సంగీతను భవన్ లో ఎంత మంది పనిచేస్తున్నారని ప్రశ్నించారు. 120 మంది అని సమాధానం ఇవ్వడంతో.. పట్టు మని పదిమందిని తీసుకురాలేకపోయారు మీరేం ఆర్గనైజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment