ఉగ్ర పోరుకు సహకారం | Indian Ocean Rim Nations Key to Future of Global Economy: Jokowi | Sakshi
Sakshi News home page

ఉగ్ర పోరుకు సహకారం

Published Wed, Mar 8 2017 2:26 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

ఉగ్ర పోరుకు సహకారం

ఉగ్ర పోరుకు సహకారం

జకార్తా: ఉగ్రవాదం, పైరసీ తదితర సరిహద్దు సమస్యలపై పరస్పరం సహకరించుకోవాలని ఇండియన్  ఓషన్  రిమ్‌ అసోసియేషన్  (ఐఓఆర్‌ఏ) తీర్మానించింది. భారత్, 20 హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో ఏర్పడిన ఈ అసోసియేషన్  జకార్తాలో భేటీ అయింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి అన్సారీతోపాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు హాజరయ్యారు.

ఐఓఆర్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇరాన్ , కెన్యా, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ తదితర 21 దేశాలకు సభ్యత్వం ఉంది. సముద్ర ప్రాంత రక్షణ, భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ, టూరిజం, సంస్కృతి తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఉగ్రవాదంపై పోరుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సమావేశం ప్రత్యేకంగా మరో తీర్మానం చేసింది. భారత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మాట్లాడుతూ అభివృద్ధికి ఉగ్రవాదం అడ్డంకిగా నిలుస్తోందని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement