Jakarta
-
వచ్చే వారం ఇండోనేషియాకు మోదీ
న్యూఢిల్లీ: ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6, 7 తేదీల్లో ఇండోనేషియాకు వెళ్లనున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియాన్లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి సారించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహా్వనం మేరకు ప్రధాని మోదీ 6, 7వ తేదీల్లో జకార్తాకు వెళుతున్నారని విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు..
జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి. The Brantas 112 Train collided with a truck in the Semarang West Flood Canal in Madukuro, Central Java, Indonesia, resulting in dramatic explosions and massive flames engulfing the area. pic.twitter.com/Fnsg3WTyp1 — Ericssen (@EricssenWen) July 18, 2023 ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు.. -
ఇండోనేసియాకు కొత్త రాజధాని.. రాజధానిని మార్చిన దేశాలివే..!
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు. జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది. దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి. రాజధానిని మార్చిన దేశాలివే..! గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి... ► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది. ► 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది. ► 1997లో కజకిస్తాన్ కూడా అల్మటి నుంచి నూర్–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ► మయన్మార్ రంగూన్ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది. కొత్త రాజధాని ఎలా ఉంటుంది? కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం. – బాంబాంగ్ సుసాంటొనొ, నుసంతర నేషనల్ కేపిటల్ అథారిటీ చీఫ్ అధ్యక్ష భవనం నమూనా కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం: 3,200 కోట్ల డాలర్లు రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు: 80% ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు: 184 ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు: 7 వేలు తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య: 15 లక్షలు అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది: 2024 ఆగస్టు 17 (దేశ స్వాతంత్య్ర దినోత్సవం) రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది: 2045 ఆగస్టు 17 (దేశ వందో స్వాతంత్య్ర దినం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indonesia: మంటల్లో ప్రాణాలు
Indonesia Fire Accident: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిహేను మందికి పైగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి పెర్టామినా ప్రభుత్వం నిర్వహించే ఓ ఫ్యూయెల్ స్టోరేజ్‌లో మంటలు ఎగసిపడి ఈ ఘోరం సంభవించింది. ఇండోనేషియా జకార్తా భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటిదాకా 16 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో (50 మందికిపైనే) తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున్న ఎగసి పడి శరవేగంగా చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. స్థానికులు ఆర్తనాదాలు చేస్తూ.. తప్పించుకునేందుకు యత్నించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది పలువురిని రక్షించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. మంటల్ని అదుపు చేయడానికి యాభైకిపైగా ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. పరిస్థితి అదుపులోకి రావడానికి గంటల తరబడి సమయం పట్టింది. మిలిటరీ చీఫ్ అబ్దురచ్మన్ స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
Semeru: నిప్పులు కక్కిన రాకాసి పర్వతం
జకార్తా: ద్వీప దేశాల్లో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం తరచూ చూసేది. అయితే.. పసిఫిక్ రీజియన్‌లోని అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ తీవ్రతకు దారి తీస్తుంటాయి కూడా. అందునా రాకాసి అగ్నిపర్వతంగా పేరున్న సెమెరూ వల్ల జరిగే నష్టం మరీ తీవ్రంగా ఉంటోంది. తాజాగా.. ఇండోనేషియా జావా తూర్పు ప్రాంతంలోని గునుంగులో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు 3,676 మీటర్ల ఆదివారం సెమెరూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో.. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు అధికారులు. కిందటి నెలలో అగ్నిపర్వతం ధాటికి 300 మంది దాకా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు అగ్నిపర్వత ముప్పుపై అక్కడ ఆందోళన నెలకొంది. Pyroclastic flow footage from the Semeru volcano in East Java, Indonesia. Imagine seeing that thing coming toward you. Terrifying. (footage sped up 5x) pic.twitter.com/84D4Dr6IIr — Nahel Belgherze (@WxNB_) December 4, 2022 తూర్పు జావాలో అతిపొడవైన అగ్నిపర్వంగా సెమెరూకి పేరుంది. సోమవారం భారీ శబ్ధం చేసుకుంటూ నిప్పులు కక్కింది ఈ రాకాసి అగ్నిపర్వతం. లావా భారీగా పల్లపు ప్రాంతానికి వస్తోంది. ఈ ప్రభావంతో ఎనిమిది కిలోమీటర్ల మేర జనాలను తిరగనివ్వకుండా జోన్‌గా ప్రకటించారు అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Gunung #Semeru volcano Java Indonesia, eruption with pyroclastic flow, 04.12.20022, 11:41 local time, realtime speed my prayers are with the people living there pic.twitter.com/YRh7Hd3rOA — Rita Bauer (@wischweg) December 4, 2022 👉TELEGRAM: https://t.co/JDDUrdyqRt 🌋On the island of East Java in Indonesia🇮🇩, the eruption of the volcano Semeru with a height of 3,676 meters began.#Indonesia #Semeru #volcano #Java #eruption #NEWS #indonesia #semeru #gunungberapi #jawa #letusan #berita pic.twitter.com/9vWD4KkylR — DISASTERS IN THE WORLD (@WRLD_disasters) December 4, 2022 #Semeru #Volcano #Indonesia Eruption 2022.12.04 Plume in motion 📸🛰#Landsat8-9 Footage(without motion) : @USGSLandsat @sentinel_hub pic.twitter.com/qAYZtxMZGo — 🛰🗺🌋❄️🌪🌊🔥👀 (@ar_etsch) December 4, 2022 Personel Polsek Pasirian Lumajang Jawa Timur sigap bantu evakuasi warga akibat Awan Panas Guguran Gunung Semeru Lumajang Doa kami menyertai untuk saudara-saudara yang di Lumajang dan sekitarnya moga semuanya diberikan keselamatan#TerusBerikanManfaat Melindungi Dari Bencana pic.twitter.com/qMKdRkrNO8 — Polres Trenggalek (@1trenggalek) December 5, 2022 WATCH: #BNNIndonesia Reports Mount #Semeru, Indonesia's tallest #volcano, erupted on Sunday, sending a massive column of ash into the sky and lava rivers down steep slopes. pic.twitter.com/TVnpAbYDcn — Gurbaksh Singh Chahal (@gchahal) December 4, 2022 అయితే తేలికపాటి వర్షం.. ప్రమాద తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇదే రాకాసి అగ్నిపర్వతం కిందటి ఏడాది బద్ధలైన ఘటనలో.. యాభై మందిదాకా పొట్టనబెట్టుకుంది. వేల మందిని అక్కడి నుంచి తరలిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే..పసిఫిక్ తీరంలో చిన్న ద్వీప సమూహాలున్న ఇండోనేషియా.. భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్ధలుకు సంబంధించిన కొన్ని భయానక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. భయంతో జనాలు పరుగులు పెడుతుండగా.. గాయపడిన కొందరిని చికిత్సకు తరలిస్తున్నవి వైరల్ అవుతున్నాయి. -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం
జకార్తా: ఇండోనేసియాలోని జావా ద్వీపం సోమవారం భారీ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. డజన్ల కొద్దీ భవంతులు పేకమేడల్లా నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భవంతులు కూలిన ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని గవర్నర్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం అందర్నీ కలచివేస్తోంది. సియాంజుర్ పట్టణంలో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. కిక్కిరిసిన ఆస్పత్రులు.. జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఆరుబయట పార్కింగ్ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి. సోమవారం మధ్యాహ్నం వేళ రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ జావాలోని సియాంజుర్ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికురాలు దేవి రిస్మా చెప్పారు. ‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిజేదిల్ గ్రామంలో శిథిలాల కింద 24 మంది చిక్కుకుని సాయంకోసం అరి్థస్తున్నారు. 27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగి్నపర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు -
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్‌లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్‌లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
ఆసియా కప్‌లో రూపిందర్ సారథ్యంలో బరిలోకి...
ఈనెల 23 నుంచి జకార్తాలో జరిగే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ కెప్టెన్‌గా... డిఫెండర్ బీరేంద్ర లాక్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి. టాప్–3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో భారత్‌కు నేరుగా ప్రపంచకప్‌లో ఎంట్రీ లభించింది. -
ఘోరం: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జైలులో అగ్ని ప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మృతువాత పడ్డారు. 8 మంది తీవ్రంగా గాయపడగా 72 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచం ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. అయితే నిద్రలో ఉన్న ఖైదీలు ఈ విషయం తెలియకపోవడంతో అగ్నికీలలకు ఆహుతయ్యారు. ఆ దేశ రాజధాని జకర్తాలోని టాంగరింగ్ జైలులో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. జైలులోని బ్లాక్ సీలో అగ్నిప్రమాదం సంభవించిందని ఆ దేశ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపుపలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు అదుపులోకి వచ్చాక పరిశీలించగా ఖైదీలు అగ్నికీలల్లో చిక్కుకుపోయి కన్నుమూసినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే బ్లాక్‌లో 40 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా రెట్టింపు స్థాయిలో122 మందికి పైగా ఉంటున్నారని జైళ్ల శాఖ వెబ్సైట్ తెలుపుతోంది. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం.. ప్రమాదం సంభివించిన తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డయ్యింది. -
భార్యగా మారిన భర్త.. చివరకు విమానం బాత్రూమ్లో..
జకర్తా (ఇండోనేసియా): ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమాన ప్రయాణాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనేక ఆంక్షలతో జరుగుతున్నాయి. కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే విమాన ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఓ కోవిడ్ సోకిన వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి విమాన ప్రయాణం చేశాడు. చివరకు తాను చేరుకోవాల్సిన గమ్యస్థానంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఇండోనేసియాలో జరగ్గా ప్రస్తుతం వైరల్‌గా మారింది. కోవిడ్ పాజిటివ్ సోకిన వ్యక్తి ఇండోనేసియాలోని జకర్తా నుంచి అదే దేశంలోని మరో పట్టణం టెర్నేట్కు విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే అతడికి కరోనా వైరస్ సోకింది. ఎలాగైనా విమాన ప్రయాణం చేయాలని తన భార్య పేరు మీద సిటిలింక్ విమానంలో టికెట్ బుక్ చేశాడు. అనంతరం ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎయిర్‌పోర్టుకు బురఖా ధరించి వచ్చాడు. తనిఖీల సమయంలో తన భార్య పాస్‌పోర్టు, ఇతర పత్రాలు, కార్డులు చూపించడంతో అధికారులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా బురఖా ధరించడంతో వారు మహిళగా భావించారు. అనంతరం ఆయన విమానం ఎక్కి టెర్నేట్కు చేరుకుంటున్నాడు. అయితే అతడు చేసిన చిన్న తప్పు పోలీసులకు పట్టేలా చేసింది. టేకాఫ్ అయ్యే సమయంలో అతడు బాత్రూమ్కు వెళ్లాడు. ఆ సమయంలో అతడు పురుషుల దానిలో వెళ్లాడు. వచ్చేప్పుడు బురఖా తీసి బయటకు వచ్చాడు. ఈ విషయం విమాన సిబ్బంది గ్రహించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన విమానం దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణించడంతో ఆ విమానంలో ప్రయాణించిన వారంతా ఆందోళన చెందుతున్నారు. వారికి విమాన సిబ్బంది పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆ దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ విధంగా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్: నువ్వు మహిళవు కాదు! సైకోవి
జకార్తా : సరదానో.. మానసిక పరిస్థితి బాగోలేకనో కొంతమంది సైకోల్లాగా వ్యవహరిస్తుంటారు. తమకు నచ్చినట్లు.. ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులను, కొన్ని కొన్ని సార్లు మూగ జీవాలను హింసిస్తుంటారు. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ కూడా అదే పని చేసింది. తన తల తిక్కపనికి ఓ మూగ జీవి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టబోయింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియా, జావాకు చెందిన ఓ మహిళ అక్కడి తమన్ సఫారీకి వెళ్లింది. కారులో అన్ని జంతువుల్ని తిరిగిచూస్తున్న ఆమె నీటిలో ఉన్న హిప్పో నోట్లోకి వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ విసిరింది. ఇది గమనించిన సింటియా ఆయూ అనే మహిళ హిప్పో నోట్లోని వస్తువులను వీడియో తీసింది. అనంతరం సఫారీ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెటర్నరీ వైద్యులు హిప్పోకు వైద్య పరీక్షలు నిర్వహించి బాటిల్‌ను బయటకు తీశారు. అనంతరం డోని హెర్డారు అనే వ్యక్తి నిందితురాలైన మహిళను కథిజాహ్గా గుర్తించాడు. తాను చేసిన పనికి క్షమాపణ చెబుతూ కథిజాహ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు మహిళవు కాదు! సైకోవి’’.. ‘‘నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా’’ అంటూ మండిపడుతున్నారు. చదవండి : పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి.. గవర్నర్ పదవికి పోటీ.. జోకర్ వేషంలో నామినేషన్ -
విమాన ప్రమాదాలకు కేంద్ర బిందువు.. అక్కడే ఎందుకు?
జకార్తా : ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? టేకాఫ్ అయిన కొద్ది సేపటికే 62 మంది ప్రయాణీకులతో నట్టనడి సంద్రంలో మునిగిపోయిన ఇండోనేషియా విమాన ప్రమాద ఘటన మరో మారు ఆ దేశ వైమానిక పరిశ్రమ భద్రతను చర్చనీయాంశంగా మార్చింది. నిజానికి అసలెందుకు ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయనే ప్రశ్నను ఈ ప్రమాదం లేవనెత్తింది. ఆసియాలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇండోనేషియా రికార్డులు అత్యంత దారుణంగా ఉన్నాయి. 1945 నుంచి ఏ ఇతర దేశాల్లో జరగనన్ని పౌర విమాన ప్రమాదాలు ఇండోనేషియాలోనే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాలన్నీ పైలెట్ శిక్షణా లోపంతో జరిగాయి. లేదా సాంకేతిక లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యలు, లేదంటే విమానాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరిగాయి. ఇటీవలి కాలంలో ఇండోనేషియా పౌర విమానయాన సంస్థ పరిస్థితి మెరుగైందని నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ తాజా ఘటన ఇండోనేషియా వైమానిక సంస్థ పర్యవేక్షణ, నియంత్రణలోని లోపాలను పట్టిచూపుతోంది. ఇక్కడి ప్రమాదాలకు కారణమేమిటి? ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమేమిటి అనేదే ఇప్పుడు సర్వత్రా వినపడుతోన్న ప్రశ్న. అయితే దీనికి ఆర్థిక, సామాజిక, భౌగోళిక సమస్యలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 1990 చివర్లో దశాబ్దాల నిరంకుశత్వం తరువాత సుహార్తో ప్రభుత్వం పడిపోయిన తరువాత ప్రారంభంలో విమానయాన సంస్థ బాగా అభివృద్ధిపథంలో నడిచింది. అయితే ఆ తరువాత ఈ రంగంలో శ్రద్ధ లోపించింది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు నాణ్యమైన, విమానయానానికి అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పటికీ, తక్కువ ధరల్లోనే ప్రయాణీకులను తీసుకెళ్ళే వైమానిక వ్యవస్థ దేశంలో సర్వసాధారణ రవాణా వ్యవస్థగా మారింది. వైమానిక భద్రతా నెట్వర్క్ గణాంకాలను బట్టి ఇండోనేషియాలో 104 పౌర విమానయాన ప్రమాదాలు జరిగాయి. 1945 నుంచి ఇప్పటి వరకు 13,00 మంది పౌరులు మరణించారు. ఏషియాలోనే విమానయానాల్లో అత్యంత ప్రమాదకర దేశంగా ఇండోనేషియాని భావిస్తున్నారు. పరిస్థితులు మెరుగుపడ్డాయా? చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని, పర్యవేక్షణ సైతం కఠినతరం చేసినట్టు ఏవియేషన్ నిపుణులు ఎయిర్‌లైన్స్ రేటింగ్స్.కామ్ జియోఫ్రే థామస్ మీడియాకి వెల్లడించారు. కచ్చితమైన నియంత్రణా పద్ధతులూ, తరచూ విమానాల పనితీరుని పర్యవేక్షించడం, పైలెట్ శిక్షణలను మెరుగుపర్చడం లాంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అమరికా ఫెడరల్ ఏవియేషన్ సంస్థ, ఇండోనేషియాకి 2016లో ఏ కాటగిరీ రేటింగ్ ఇచ్చింది. దీనర్థం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల ప్రమాణాలతో సరితూగే ప్రమాణాలను ఇండోనేషియా వైమానిక పరిశ్రమలు పాటిస్తున్నాయని భావన. తాజా ప్రమాదం ఎందుకు జరిగినట్టు? దీన్ని ఇప్పుడే చెప్పడం కష్టం. విమానం జకార్తా నుంచి భారీ వర్షంలో టేకాఫ్ అయ్యింది. అయితే ఫ్లైట్ కండిషన్, మానవ లోపంతో పాటు అనేక కారణాల్లో వాతావరణ పరిస్థితులు ఒక కారణం మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం, తమ పడవల చుట్టూ చమురు వెదజల్లినట్టు పడిందని స్థానిక మత్స్య కారులు తెలిపారు. శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా జరిగాయని తెలుస్తోంది. 2008లో ఒకసారి హైడ్రాలిక్ సమస్య కారణంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వైప్ ఒక రైతుని ఢీకొనడంతో అతను మరణించారు. ప్రమాదం జరిగిన బోయింగ్ 737–500 విమానం 26 ఏళ్ళనాటిదని, గతంలో అమెరికా నుంచి కూడా దీన్ని నడిపారని, ఇది నాణ్యమైనదని ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ జనరల్ జెఫర్సన్ ఇర్విన్ జౌవేనా తెలిపారు. అయితే ఫ్లైట్ నడపడానికి అర్హమైనదేనా కాదా అనే విషయంలో దర్యాప్తు చేయాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా బ్యాన్ 2007 నుంచి 2016 వరకు అమెరికాలోనూ, 2007 నుంచి 2018 వరకు యూరోపియన్ యూనియన్లోనూ ఆయా దేశాల నుంచి ఇండోనేషియా విమానాలను రద్దు చేశారు. సాంకేతిక నైపుణ్యలోపం, సుశిక్షుతులైన పైలెట్లు లేకపోవడం, పర్యవేక్షణాలోపాలే ఈ దేశాల్లో ఇండోనేషియా విమానాల నిషేధానికి కారణమని తెలిపారు. ఎప్పుడు తెలుస్తుంది? నీటి నుంచి వెలికితీసిన విమాన శిథాలాల్లో నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. సముద్రగర్భంలోని బురదలో బ్లాక్‌బాక్స్‌లను గుర్తించారు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దర్యాప్తునకు కొన్ని వారాలు పడుతుంది. కొన్ని నెలలు కూడా పట్టొచ్చునని ఇండోనేషియా ఏవియేషన్ కన్సల్టెంట్ జెర్రీ సోజెత్మాన్ తెలిపారు. -
ఇండోనేషియాలో మరో ప్రమాదం
జకర్తా: ఇండోనేషినియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా.. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయని నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (బీఎన్‌పీబీ) అధికారి ఒకరు తెలిపారు. మొదట కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఖాళీ చేయిస్తున్న సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. మృతుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు. సైనికులు, పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ ఏజెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయయి. శనివారం గరుట్, సుమేడాంగ్‌తో సహా పశ్చిమ జావాలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. -
ఇండోనేషియా విమాన ప్రమాదం ఫొటోలు
-
ఇండోనేషియా విషాదం: బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యం
జకార్తా: శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ బట్టి వాటిని త్వరలోనే బయటికి తీస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా నేటి ఉదయం లాంకాంగ్, లకీ ద్వాపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మునుషులు శరీర బాగాలు, దుస్తులు లభ్యమవడంతో ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికిలేరన్న విషయం అర్థమవుతుంది. కాగా విమానం నడిపిన పైలట్లు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్సులను వెలికి తీసి పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: ఇండోనేషియాలో కూలిన విమానం?) శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయింది. -
కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు
జకార్తా: కరోనా మన జీవితాల్లో భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, సరదాలు, పండగలు, పబ్బాలు ఏవి లేవు. మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు, రైలు, విమాన ప్రయాణాలు అంటేనే జనాలు దడుచుకునే పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం పరిస్థితులు మారాయి అనుకొండి. కానీ ఇప్పటికి చాలా మందిలో కరోనా భయం అలానే ఉంది. దానికి తోడు ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. అందుకే నలుగురితో కలవాలన్న.. కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చేప్పుకోబేయే వ్యక్తి. కరోనా వైరస్‌కు భయపడి ఈ వ్యక్తి ఏకంగా విమానం మొత్తాన్ని ఇద్దరి కోసం బుక్ చేసుకున్నాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (చదవండి: మీ అడుగులు ఎటువైపు..) ఇండోనేషియా జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ ఇటీవల తన భార్య షల్విన్నీ ఛాంగ్‌తో కలిసి బాలీకి వెళ్లారు. అయితే ఇందుకోసం ఆయన లయన్ ఎయిర్ గ్రూప్‌నకు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలోని అన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భావించిన రిచర్డ్.. వైరస్ నుంచి రక్షణ కోసం ఈ విధంగా విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఈ విషయాన్ని రిచర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘విమానంలోని సీట్లన్నీ బుక్ చేసినా కూడా.. ప్రైవేట్ జెట్ కంటే తక్కువ ఖర్చే అయ్యింది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జకార్తా: ఇండోనేసియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ముందుస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. బాంటన్ కోస్ట్, జావాలాంటి సముద్ర తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలు.. అక్కడి ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సునామీ హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇండోనేసియాను ఇటీవల కాలంలో వరుస భూకంపాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించారు. తీర ప్రాంత ప్రజలను మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇంటరాగేషన్ పేరుతో దారుణం..
జకర్తా : ఇండోనేషియా పోలీసులు తమ కండ కావరాన్ని ప్రదర్శించారు. చోరీ కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ అతడు నేరాన్ని అంగీకరించకపోవడంతో చేతులు కట్టేసి ఓ బతికున్న భారీ సైజు పామును నిందితుడిపై వదిలారు. ఈ సంఘటన పపువాలో చోటుచేసుకుంది. తనను వదిలేయమని అతను ప్రాధేయపడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా మరో పోలీసుల అధికారి పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని అనడం వీడియోలో రికార్డయింది. అక్కడే ఉన్న పోలీసు పాము తోకను నిందితుడి నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు ఎన్ని చోరీలు చేశావని అడగ్గా, అతను రెండు చోరీలు మాత్రమే చేశానని నేరాన్ని అంగీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మలేషియా పోలీసులు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విచారణ అధికారి ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. -
నిందితుడిపై పాములను వదిలి ఇంటరాగేషన్
-
సునామీ ఎందుకు వచ్చింది?
ఇండోనేసియాలో తీవ్ర విధ్వంసం సృష్టించిన సునామీ రాకకు గల కారణాలపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం దక్షిణ పార్శ్వంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలిపోవడంతో సునామీ వచ్చిందని తేల్చారు. ‘ఒక కొండచరియ విరిగిపడినట్టుగా అకస్మాత్తుగా అగ్ని పర్వతంలోని ఒక భాగం పడిపోవడంతో నీరు స్థానభ్రంశం చెంది తరంగాలు నిట్టనిలువుగా పైకి విరజిమ్మాయి.దీంతో ఒకేసారి రాకాసి అలలు తీర ప్రాంతంపై విరుచుకుపడ్డాయి‘ అని భూకంప అధ్యయన శాస్త్రవేత్త శ్యామ్ టేలర్ అభిప్రాయపడ్డారు. అయితే, కచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుందని చెప్పడానికి ఆధారాలు ఉండవన్నారు. జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం గత కొన్ని నెలలుగా లావాను విరజిమ్ముతోంది. సునామీ రావడానికి సరిగ్గా 24 నిమిషాలు ముందు అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలిపోయిందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలడం వల్ల దాని పైకప్పు తెరుచుకుని విస్ఫోటం ఏర్పడుతుంది. ఆ శిథిలాలు ఒకేసారి సముద్రంలో పడిపోవడం వల్ల నీరు కొన్ని వందల మీటర్లు పైకి ఎగజిమ్ముతుందని టేలర్ వివరించారు. అగ్ని పర్వతం సింహభాగం కుప్పకూలడం వల్లనే రాకాసి అలలు దూసుకువచ్చాయన్నారు. భూకంపం కూడా వచ్చిందా ? సునామీకి ముందు ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతానికి 25 కిలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. ‘భూకంపం ప్రభావం అగ్నిపర్వతంపై పడింది. దాంతో పర్వతం ఒరిగిపడింది. సముద్ర మట్టానికి 300 మీటర్లకు పైగా ఎత్తులో క్రకటోవా అగ్నిపర్వతం ఉండడంతో భారీగా ఉన్న దాని శకలాలు అంతెత్తు నుంచి నీళ్లలో పడడంతో సునామీ ముంచెత్తింది’ అని తెలిపింది. ముందు సంకేతాలు ఎందుకు లేవంటే ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం నిరంతరం చప్పుళ్లు చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో శబ్ధ కాలుష్యం నెలకొంది. దీంతో అది కూలిపోయినా ఆ శబ్దాన్ని ఎవరూ అంతగా గుర్తించలేదు. అంతేకాకుండా భూకంపం వల్ల కాకుండా, అగ్నిపర్వతం కూలడంతో సునామీ రావడం వల్ల భూకంప నమోదు కేంద్రాల్లో సిగ్నల్స్‌కి కూడా అది అందలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి కంపించడం, సముద్రం ఉప్పొంగడం వంటి సూచనలేవీ లేకుండా అకస్మాత్తుగా 10 అడుగుల ఎత్తుకి అలలు ఎగసిపడటంతో భారీ నష్టం సంభవించిందని తెలిపారు. అగ్ని పర్వతం విరిగిపడిన సుమారు 24 నిమిషాల తర్వాత నిశ్శబ్ద సునామీ సంభవించడంతో యంత్రాంగం అప్రమత్తం అయి ప్రజలకు హెచ్చరికలు చేసేందుకు ఎలాంటి వ్యవధి లేకుండాపోయిందన్నారు. అగ్నిపర్వతం కారణంగా సునామీలు ఏర్పడటం అరుదైన విషయమని అందువల్ల ముందుగా తెలుసుకోవడం కష్టమయిందని నిపుణులు అంటున్నారు. అయితే, క్రకటోవా ఇంకా ఎగసిపడుతూనే ఉందని, మరో నెల లేదంటే ఏడాదిలో ఇది విరిగిపడి మరో భీకర ప్రళయం సంభవించవచ్చని మరో శాస్త్రవేత్త మెక్కినన్ హెచ్చరించారు. పాప్ గ్రూప్‌లో ఒక్కరే సజీవం సునామీ రాక్షస అలల్లో చిక్కిన ‘సెవెంటీన్’ పాప్ గ్రూప్ సభ్యుల్లో ఒక్కరు తప్ప దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూప్ మేనేజర్ ఒకి విజయ, హెర్మాన్ సికుంబాంగ్, రుక్మానా రుస్తం, విష్ణు ఆండీ ధర్మవాన్లకు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. పాప్ బృందంలోని రీఫియన్ ఫజర్శ్యా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ‘సెవెంటీన్’ పాప్ గ్రూప్ జావాలోని టాన్జుంగ్ బీచ్ రిసార్టులో ప్రదర్శన సమయంలో సునామీ విరుచుకుపడింది. సునామీ మృతులు 373 జకార్తా: ఇండోనేసియా సునామీలో సజీవంగా ఉన్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. శనివారం రాత్రి సంభవించిన ఈ విలయంలో మృతుల సంఖ్య 373కు చేరుకుందని జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో సోమవారం తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో 128 మంది జాడ తెలియాల్సి ఉండగా, గాయపడిన 1,459 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులపై ఆకస్మికంగా విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరింత తీవ్రతతో అలలు తీరంపైకి విరుచుకుపడే అవకాశముందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 281 మందికి అంత్యక్రియలు.. సునామీలో ప్రాణాలు కోల్పోయిన 281 మందికి ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించినట్లు సుటొపో పుర్వో నుగ్రొహో తెలిపారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కరిటా బీచ్ ప్రాంతంలో ధ్వంసమైన వందలాది భవనాల శకలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన, సజీవంగా ఉన్న వారి కోసం వందలాది మంది సైనిక సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తీరం వెంబడి గాలిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ తదితర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలను చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాయి. ఈ సహాయక చర్యలు మరో వారం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. బాధిత ప్రాంతాలను సోమవారం అధ్యక్షుడు విడోడో సందర్శించారు. -
మృత్యు సునామీ.. 222 మంది మృతి
ఇండోనేసియాను మరో జల విలయం ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాలకు తరచూ గురయ్యే ఈ ద్వీప సముదాయ దేశంలో తాజాగా ఓ సునామీ మృత్యు పాశమై పెను విధ్వంసం సృష్టించింది. శినివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడింది. సముద్రం నుంచి దూసుకొచ్చిన మృత్యు అలలు క్షణాల్లో 222 మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మందిని గాయాలపాలు చేశాయి. బలమైన అలల తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కెరీటా ఇండోనేసియాలో మరో భారీ ప్రకృతి విలయం సంభవించింది. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా సునామీ రావడంతో 222 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానంలో శనివారం రాత్రి 8 గంటలు) సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది.సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయని అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం తెలిపింది. కాగా, ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఇండోనేసియాకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘ఇండోనేసియాలో సునామీ కారణంగా జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని చింతిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల నేతలు ఇండోనేసియాకు సానుభూతి తెలిపారు. సెవెంటీన్ పాప్ గ్రూప్‌పై.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపడుతున్నామనీ, మొత్తంగా 28 మంది గల్లంతయ్యారని ఇండోనేసియా జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సునామీ కారణంగా 222 మంది మరణించగా, మరో 843 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. సుండా జలసంధి సమీపంలోని తీరాల్లో, జావా ద్వీపంలోని పాండెగ్లాంగ్ జిల్లాలో 163 మంది చనిపోయారనీ, అత్యధిక మరణాలు రెండు హోటళ్లలో సంభవించాయని నుగ్రోహో చెప్పారు. సెరంగ్లో 11 మంది, సుమత్రా దీవిలోని దక్షిన లంపుంగ్లో 48 మంది చనిపోయారన్నారు. ఈ సునామీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ వీడియో భీతి గొల్పేలా ఉంది. ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. అనంతరం అల ప్రేక్షకులను ముంచెత్తింది. సునామీ కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. శిథిలాలు, చెత్త, చెదారమంతా బీచ్‌ల్లోకి చేరింది. జావా ద్వీపంలోని కెరీటా బీచ్‌లోకి ఓ ఇంటి పైకప్పుకు అమర్చిన రేకులు, మొద్దులు, ఇతర శిథిలాలు కొట్టుకొచ్చాయి. సునామీ సమయంలో అగ్ని పర్వతం ఫొటోలు తీస్తున్న ఓయ్స్టీన్ అండర్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘అకస్మాత్తుగా ఓ పెద్ద అల వచ్చింది. అది తీరం దాటి దాదాపు 20 మీటర్లు ముందుకొచ్చింది. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన అల తీరంలోని హోటల్ ప్రాంతాన్ని ముంచేసింది. కార్లు, కంటెయినర్లు 10 మీటర్లకు పైగా దూరం కొట్టుకుపోయాయి’ అని చెప్పారు. మొత్తం మృతుల సంఖ్య అప్పుడే చెప్పలేం సునామీ మృతుల సంఖ్య స్పష్టంగా తెలిసేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చని రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీస్ అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన కేథీ ముల్లర్ తెలిపారు. శిథిలాలను పూర్తిగా తొలగించేంత వరకు మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేమనీ, రాబోయే కొన్ని రోజులు, వారాల పాటు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని ఆమె అన్నారు. సహాయక బృందాలు గాయపడిన వారిని వైద్యశాలలకు తరలిస్తున్నాయి. తమ సంస్థల తరఫున సహాయక శిబిరాలు నెలకొల్పి ప్రజలకు తాత్కాలిక వసతిని, ఆహారాన్ని అందజేస్తున్నట్లు కేథీ చెప్పారు. సునామీ కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు తమ బృందాలు సిద్ధమవుతున్నాయన్నారు. కాగా, ఇండోనేసియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయి. ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలోనూ సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో సునామీ వచ్చి వేలాది మంది చనిపోయారు. 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేసియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు. పేలిన అగ్నిపర్వతం సుమత్రా, జావా ద్వీపాల మధ్యలో పేలిన ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం వీధి విధ్వంసం సునామీలో పూర్తిగా ధ్వంసమైన వీధి, వాహనాలు శవాల దిబ్బ కవర్లలో చుట్టిన మృతదేహాల్లో తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు -
ఇండోనేషియాలో సునామీ విధ్వంసం
-
ఇండోనేషియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ
-
సునామీ ప్రతాపం.. 228 మంది మృతి
జకార్తా: దీవుల దేశం ఇండోనేషియాను సునామీ మరోసారి ముంచెత్తింది. శనివారం అర్థరాత్రి సమయంలో సంభవించిన సునామీ ధాటికి 228 మంది మరణించగా, 700మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ ప్రతాపాన్ని చూపించింది. అలలు తీవ్రంగా విరుచుకుపడడంతో వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ సుమ్రతా, జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు ఆదేశ విపత్తు నిర్వహణ అధికారి పుర్వో నుర్గోహో తెలిపారు. సునామీ ధాటికి కొంతమంది గల్లంతయ్యారని వారికోసం గాలింపుచర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.