
Indonesia Fire Accident: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిహేను మందికి పైగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి పెర్టామినా ప్రభుత్వం నిర్వహించే ఓ ఫ్యూయెల్ స్టోరేజ్‌లో మంటలు ఎగసిపడి ఈ ఘోరం సంభవించింది.
ఇండోనేషియా జకార్తా భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటిదాకా 16 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో (50 మందికిపైనే) తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున్న ఎగసి పడి శరవేగంగా చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. స్థానికులు ఆర్తనాదాలు చేస్తూ.. తప్పించుకునేందుకు యత్నించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది పలువురిని రక్షించారు.
ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. మంటల్ని అదుపు చేయడానికి యాభైకిపైగా ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. పరిస్థితి అదుపులోకి రావడానికి గంటల తరబడి సమయం పట్టింది. మిలిటరీ చీఫ్ అబ్దురచ్‌మన్ స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment