జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి.
ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి.
The Brantas 112 Train collided with a truck in the Semarang West Flood Canal in Madukuro, Central Java, Indonesia, resulting in dramatic explosions and massive flames engulfing the area. pic.twitter.com/Fnsg3WTyp1
— Ericssen (@EricssenWen) July 18, 2023
ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
Comments
Please login to add a commentAdd a comment