
న్యూఢిల్లీ: ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6, 7 తేదీల్లో ఇండోనేషియాకు వెళ్లనున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఏషియాన్‌లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి సారించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహా్వనం మేరకు ప్రధాని మోదీ 6, 7వ తేదీల్లో జకార్తాకు వెళుతున్నారని విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment