truck - train collision
-
ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు..
జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి. The Brantas 112 Train collided with a truck in the Semarang West Flood Canal in Madukuro, Central Java, Indonesia, resulting in dramatic explosions and massive flames engulfing the area. pic.twitter.com/Fnsg3WTyp1 — Ericssen (@EricssenWen) July 18, 2023 ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు.. -
ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..
న్యూయార్క్: కొన్ని యాక్సిడెంట్లు ఎంత భయంకరంగా జరుగుతాయంటే అసలు మనిషి బతికి ఉండే అవకాశం లేదన్నంత భయంకరంగా జరుగుతాయి. పైగా వాటిని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించేంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. (చదవండి: బాప్రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!) అసలు విషయంలోకెళ్లితే... యూఎస్‌లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో అలెగ్జాండర్ ఎవాన్స్ అనే 33 ఏళ్ల వ్యక్తి అమెజాన్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఎవాన్స్ తన అమెజాన్ డెలివరీ ట్రక్‌తో మిల్వాకీలోని ఆమ్ట్రాక్ రైలును క్రాస్ చేస్తుంటాడు. అయితే అదే సమయంలో ఒక రైలు వస్తుంటుంది. కానీ ఎవాన్స్‌కి ఎడమ చెవి పనిచేయదు అందువల్ల అతను రైలు శబ్దాన్ని గమనించలేకపోతాడు. దీంతో రైలు ఒక్కసారిగా అతని ట్రక్‌ని ఢీ కొడుతుంది. ఇక అంతే రైలు ఆ ట్రక్‌ని ఈడ్చుకుని వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ ఎవాన్స్ తన ప్రాణం రక్షించుకోవటం కోసం ఏదోరకరంగా నడపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతని ట్రక్ రెండు ముక్కలుగా అయిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఎవాన్స్ ఆ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడతాడు. ఈ మేరకు ఎవాన్స్ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్తను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు. రైల్వే ట్రాక్ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక సిగ్నల్లు, గేట్లు, లైట్లు వంటి సంకేతాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తలెత్తవు’ అంటూ ఫేస్బుక్లో చెప్పుకొచ్చింది. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) -
ట్రక్కు, రైలు ఢీకొని 15 మంది దుర్మరణం
ట్యునిస్ (ట్యునిషియా): ట్యునిషియా రాజధాని ట్యునిస్ సమీపంలో ట్రక్కు, రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 70 మంది గాయాలపాలయ్యారు. స్థానిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ పెద్ద ట్రక్కు రైలును ఢీకొట్టడంతో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని చెప్పారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడని స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది రైలు ప్రయాణికులేనని రవాణా అధికారులు వెల్లడించారు. రాజధాని ట్యునిస్ కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాఫోర్ పట్టణం నుంచి బయలుదేరిన రైలు 60 కి.మీ ప్రయాణించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తుంది. రైలు, ట్రక్కు డ్రైవర్లు ఇద్దరూ అధిక వేగంతో వాహనాలను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.