పట్టపగలు బిల్‌బోర్డును చూసి బిత్తరపోయారు! | porn film plays on billboard | Sakshi
Sakshi News home page

పట్టపగలు బిల్‌బోర్డును చూసి బిత్తరపోయారు!

Published Sat, Oct 1 2016 6:58 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

పట్టపగలు బిల్‌బోర్డును చూసి బిత్తరపోయారు! - Sakshi

పట్టపగలు బిల్‌బోర్డును చూసి బిత్తరపోయారు!

రోడ్డు పక్కన, కూడళ్లలో ఉండే బిల్‌బోర్డుల (డిజిటల్‌ స్క్రీన్‌లపై)పై నిత్యం ఏదో వాణిజ్య ప్రకటన మనం చూస్తునే ఉంటాం. కానీ ఇండోనేషియా రాజధాని జకర్తాలో పట్టపగలు ఓ బిల్‌బోర్డుపై వస్తున్న దృశ్యాలు చూసి వాహనదారులకు మూర్ఛవచ్చినంత పనైంది. ఆ దృశ్యాలను చూస్తూ ప్రజలు బిత్తరపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

జకర్తాలో శుక్రవారం బాగా రద్దీ సమయంలో ఓ బిల్‌బోర్డుపై పోర్న్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ శృంగార దృశ్యాలను చూసి వాహనదారులు షాక్‌ తిన్నారు. కొద్దిసేపు ఆ దృశ్యాలు ప్రసారమైన తర్వాత పవర్‌ కట్‌ అయింది. భారీ ట్రాఫిక్‌ జామ్‌లో ఆ దృశ్యాలను చూసిన వాహనదారులు చాలామంది.. వాటిని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.

ఇండోనేషియాలో భారీ ప్రకటన స్క్రీన్లను ఏర్పాటుచేసే 'వీడియోట్రోన్‌' సంస్థ బిల్‌బోర్డులో ఈ షాకింగ్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీంతో వీడియోట్రోన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎవరో దుండగులు హ్యాక్‌ చేసి ఈ దృశ్యాలను ప్రసారం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement