నదిలో పడిన బస్సు: 16 మంది మృతి | 16 dead as Indonesia bus plunges into river | Sakshi
Sakshi News home page

నదిలో పడిన బస్సు: 16 మంది మృతి

Published Wed, Aug 21 2013 2:28 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

16 dead as Indonesia bus plunges into river

జావా దీవిలోని సిసుర్వా సమీపంలో బుధవారం ఓ బస్సు నదిలో పడిన ఘటనలో 16 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఘటనలో 32 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరికొంత మందికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. వారంత ఇండోనేషియాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

 

60 మంది ప్రయాణికులతో ఓ బస్సు  బుధవారం హిల్స్ రిసార్ట్స్ను సందర్శించి అనంతరం ఇండోనేషియా రాజధాని జకార్తాకు తిరుగు ప్రయాణంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. బస్సు బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement