![43 Killed In Indonesia Tsunami 600 Injured - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/23/Indonesia-Tsunami_4.jpg.webp?itok=ZfYu957f)
జకార్తా: దీవుల దేశం ఇండోనేషియాను సునామీ మరోసారి ముంచెత్తింది. శనివారం అర్థరాత్రి సమయంలో సంభవించిన సునామీ ధాటికి 228 మంది మరణించగా, 700మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ ప్రతాపాన్ని చూపించింది. అలలు తీవ్రంగా విరుచుకుపడడంతో వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని అధికార వర్గాలు వెల్లడించాయి.
దక్షిణ సుమ్రతా, జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు ఆదేశ విపత్తు నిర్వహణ అధికారి పుర్వో నుర్గోహో తెలిపారు. సునామీ ధాటికి కొంతమంది గల్లంతయ్యారని వారికోసం గాలింపుచర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment