java
-
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆసీజన్లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో పండ్లు ఎక్కువగా వస్తాయి. నేనేడు పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్‌లు, జ్యూస్‌లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్ల నేరేడు ప్రయోజనాలునేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిదినేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ.నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. అపోహనేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.ఎవరు తినకూడదంటే...నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు. -
కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
ప్రారంభం నంజుంచి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సామర్థ్యానికి ప్రజలు మంత్ర ముగ్దులయ్యారు. నేడు ఈ టెక్నాలజీ ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది. దిగ్గజ సంస్థలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఓపెన్ఏఐ మాత్రమే కాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా సొంత చాట్బాట్లు, జెమిని, బింగ్ వంటి వాటిని ఆవిష్కరించుకున్నాయి. ఇటీవల దేశీయ దిగ్గజం రిలయన్స్ కంపెనీ కూడా హనూమాన్ (Hanooman) అనే ఏఐ ఆవిష్కరించింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు 'ఏఐ'దే అంటున్నారు. ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతుంటే.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. ఉద్యోగం కావాలంటే తప్పకుండా టెక్నాలజీలో నైపుణ్యం కలిగి ఉండాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎన్విడియా (Nvidia) సీఈఓ 'జెన్సన్ హువాంగ్' కూడా ఏఐ ప్రభావం ఉద్యోగాల మీద చాలా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి ప్రపంచంలో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. గతంలో ప్రతి ఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని సూచించారు, కానీ నేడు దాని అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్’! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మానవీయంగా ఉండేలా టెక్నాలజీని క్రియేట్ చేయడం తమ బాధ్యతని సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. కాబట్టి ఇక మీద సీ++, జావా వంటి కోడింగ్ లాంగ్వేజస్ అవసరం లేదని, రాబోయే రోజుల్లో ఏఐ మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. -
Indonesia Earthquake: జావాను కుదిపేసిన భూకంపం
జకార్తా: భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఉత్తర ప్రాంతం వైపుగా జావా ద్వీపాన్ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం భారీ ప్రకంపనలు జావా చుట్టుపక్కల కుదిపేశాయి. అయితే.. భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతం కావడంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. సురబయ, టుబాన్, డెన్‌పాసర్, సెమరాంగ్‌లలో ప్రకంపనల తీవ్రత స్పష్టంగా కనిపించిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నష్టంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే.. USGS భూకం తీవ్రత 7గా నమోదు చేయగా.. మరోవైపు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మో లాజికల్ సెంటర్ (EMSC) భూకంపం 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది. -
డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, జావా టెక్నాలజీల నిపుణులకు ఫుల్ డిమాండ్
ముంబై: డిజిటల్ టెక్నాలజీల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డేటా అనలిటిక్స్, జావా వంటి టెక్నాలజీల్లో ’అత్యంత ప్రత్యేక’ నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ క్వెస్ ఒక నివేదికలో వెల్లడించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా ఈ రెండింటితో పాటు క్లౌడ్ ఇన్ఫ్రా టెక్నాలజీలు, యూజర్ ఇంటర్ఫేస్ మొదలైన సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలున్న వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్స్‌కు అత్యధికంగా బెంగళూరులో (40 శాతం), హైదరాబాద్‌లో (30 శాతం) డిమాండ్ నెలకొనగా .. జావా టెక్నాలజీల నిపుణులకు పుణె (40 శాతం), బెంగళూరులో (25 శాతం) డిమాండ్ కనిపించింది. అలాగే క్లౌడ్ ఇన్ఫ్రా సాంకేతికత నిపుణులపై ఎక్కువగా బెంగళూరులో (60 శాతం), చెన్నైలో (15 శాతం) ఆసక్తి కనిపించింది. టెక్నాలజీ నియామకాల మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ బాగానే ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ తెలిపారు. కంపెనీలు డిజిటల్, క్లౌడ్ సేవల వైపు మళ్లుతుండటంతో ఈ విభాగాల్లో హైరింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ఐటీ మెట్రో హబ్‌లలోనే టాప్ డిజిటల్ నిపుణుల నియామకాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు. సింహభాగం డిమాండ్ హైదరాబాద్‌లో (34 శాతం) నమోదైంది. బెంగళూరు (33 శాతం), ముంబై (12 శాతం), పుణె (9 శాతం), చెన్నై (5 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆయా హోదాలకు అర్హులైన ఉద్యోగార్థులను మదింపు చేసే అల్గోరిథమ్ ఆధారిత గణాంకాల ద్వారా క్వెస్ ఈ నివేదికను రూపొందించింది. -
యెజ్డీ మళ్లీ వచ్చింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుర్రకారును 90వ దశకం వరకు ఉర్రూతలూగించిన చెక్ బ్రాండ్ యెజ్డీ బైక్స్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఒకేసారి మూడు మోడళ్లు గురువారం ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ ఉన్నాయి. 26 ఏళ్ల విరామం తర్వాత పోటీ ధరతో యెజ్డీ కొత్త జర్నీ ప్రారంభించడం విశేషం. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ భారత్‌లో జావా, బీఎస్‌ఏతోపాటు తాజాగా యెజ్డీ బ్రాండ్‌ను పరిచయం చేసింది. 1996 వరకు యెజ్డీ బైక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, కేటీఎంకు ఇప్పుడు యెజ్డీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఢిల్లీ ఎక్స్ షోరూంలో ధర మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.1.98 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఉన్న ప్లాం టులో ఇవి తయారవుతున్నాయి. ఏటా 5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇవీ ఫీచర్ల వివరాలు.. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోడళ్లు 334 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ ఇంజిన్‌తో తయారయ్యాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, కాన్స్టాంట్ మెష్ 6 స్పీడ్ గేర్ బాక్స్, ఏబీఎస్, 29.1–30.2 పీఎస్ పవర్, డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. ట్యాంక్ సామర్థ్యం మోడల్‌నుబట్టి 12.5–15.5 లీటర్లు. బరువు 182–188 కిలోలు. సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్‌తో అడ్వెంచర్, ట్విన్ ఎగ్జాస్ట్‌తో మిగిలిన రెండు మోడళ్లు రూపుదిద్దుకున్నాయి. విస్తృత స్థాయిలో 14 రంగులు కస్టమర్లను అలరించనున్నాయి. రూ.5 వేలు చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు సైతం మొదలైనట్టు క్లాసిక్ లెజెండ్స్ కో–ఫౌండర్ అనుపమ్ థరేజా ఈ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ పునరుద్ధరణ, డిజైన్, ఆర్అండ్డీ, పారిశ్రామికీకరణకు క్లాసిక్ లెజెండ్స్ ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. It's not a motorcycle, it's an emotion. It's an era. It's a way of life. And we're back, thundering thrice in three new avatars! Book your test rides now - https://t.co/esLonZ0DEr .#NotForTheSaintHearted #Yezdi #YezdiIsBack #YezdiMotorcycles #YezdiForever pic.twitter.com/WvwiiVoA2Z — yezdiforever (@yezdiforever) January 13, 2022 -
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే లక్షల్లో జీతాలు!
వెబ్సైట్లలో యూజర్ ఇంటరాక్టివిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్లకు జావాస్క్రిప్ట్‌ను జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటీతో కూడిన డైనమిక్ వెబ్సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటీ రంగంలో.. ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్లో జావాస్క్రిప్ట్ కీలక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మారుతోంది. చిన్నచిన్న కంపెనీల నుంచి పెద్ద సంస్థల వరకూ.. జావాస్క్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో.. జావాస్క్రిప్ట్‌తో ప్రయోజనాలు.. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తీరుతెన్నులు.. నేర్చుకునేందుకు అర్హతలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... జావాస్క్రిప్ట్ అనేది వెబ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్తోపాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్ పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్సైట్లు రూపొందించేందుకు జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. ఇది వెబ్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లలో ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్సేవల్లోనూ జావాస్క్రిప్ట్ డెవలపర్‌ది ప్రధాన పాత్ర. డెవలపర్ ఉద్యోగాల్లో మూడో వంతు ఉద్యోగాలు వీరికి సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్క్రిప్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. జావాస్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్లను రూపొందించడానికి డెవలపర్లు ఉపయోగించే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్సైట్లలో ఉపయోగించే డ్రాప్‌డౌన్ మెనూ, ఏదైనా బటన్‌ను క్లిక్ చేయడం, పేజీలో రంగును మార్చడం వంటివి జావాస్క్రిప్ట్కు ఉదాహరణలు. జావాస్క్రిప్ట్‌ను వెబ్ అప్లికేషన్లు, గేమ్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఉపయోగించే బహుళార్ధసాధక ప్రోగ్రామింగ్ భాషగా కూడా పేర్కొంటారు. జావాస్క్రిప్ట్‌ను ఒకసారి రాసి.. ఎన్నిసార్లయినా రన్ చేసే వెసులుబాటు ఉంది. అప్లికేషన్స్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్: ఆబ్జెక్టులను క్రియేట్ చేయడానికి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. ఆ ఆబ్జెక్టును ఇంటరాక్టివ్‌గా మార్చడానికి జావాస్క్రిప్ట్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు హెచ్టీఎంఎల్తో వెబ్సైట్లో ‘అప్లోడ్ ఫైల్’ కనిపించేలా చేయొచ్చు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్‌ను అప్లోడ్ చేయడానికి వీలుకల్పించేదే జావాస్క్రిప్ట్. అలాగే ఇమేజెస్, టెక్స్›్ట ఫీల్డ్ తదితర ఫీచర్లను హెచ్టీఎంఎల్తో క్రియేట్ చేసినా.. అవి ఇంటరాక్టివ్‌గా పనిచేయాలంటే.. జావాస్క్రిప్ట్‌ను హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సీఎస్ఎస్ జావాస్క్రిప్ట్, సీఎస్‌ఎస్‌లను వేర్వేరు విధాలుగా వెబ్‌పేజీలలో ఉపయోగిస్తారు. వెబ్సైట్లో ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కోసం లే అవుట్‌ను రూపొందించడానికి సీఎస్ఎస్ సహాయపడుతుంది. వెబ్‌పేజీని ఇంటరాక్టివ్‌గా చేసేందుకు జావాస్క్రిప్ట్ ఉపయోగపడుతుంది. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్కు సంక్షిప్త రూపం..ఏపీఐ. అప్లికేషన్లను కమ్యూనికేట్ చేయడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఫోన్లో ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నుంచి సర్వర్‌కు డేటా వెళ్లడం, కావాల్సిన సమాచారంతో డేటా మళ్లీ ఫోన్‌కు రావడం ఏపీఐ ద్వారా జరుగుతుంది. జావాస్క్రిప్ట్‌లో ఏపీఐలు సర్వర్, క్లయింట్ మధ్య ఇంటర్ఫేస్ను ఏర్పరుస్తాయి. వెబ్ అడ్మిన్ సూచనల ఆధారంగా పేజీని యాక్సెస్ చేయడానికి ఏపీఐలు, వినియోగదారులను అనుమతిస్తాయి. ∙యూజర్‌కు కనిపించే ఫ్రంట్ ఎండ్తోపాటు, బ్యాక్ ఎండ్‌లోనూ నోడ్జేఎస్తో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా డెవలపర్లు డేటాబేస్ నుంచి డేటాను తిరిగి పొందవచ్చు, సేవ్ చేయవచ్చు. అంతేకాకుండా పేమెంట్లు చేయడం, సోషల్ మీడియా పోస్ట్‌లను సేవ్ చేయడం వంటివీ చేయొచ్చు. వెబ్పేజీల్లో అపరిమితమైన ఫంక్షన్ల ద్వారా జావాస్క్రిప్ట్ భాషను ఉపయోగిస్తారు. వెబ్ పేజీలలో జావాస్క్రిప్ట్ ► మౌస్తో కదిలించినప్పుడు, క్లిక్ చేసినప్పుడు వచ్చే మార్పులు. ► పేజీలో హెచ్‌టీఎంఎల్ కంటెంట్ కలపడం, మార్చడం లేదా తీసివేయడం. ► టైపింగ్ చేస్తున్నప్పుడు జరిగే మార్పులు. ► ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం. ► కాచీలో డేటా నిల్వచేయడం. ► వెబ్సైట్ వీక్షకులతో ఇంటరాక్షన్, సందేశాలు పంపడం. ► మొబైల్ అప్లికేషన్లు, ఆన్లైన్ గేమ్‌లను రూపొందించడానికీ జావాస్క్రిప్ట్ ఉపయోగిస్తున్నారు. బ్రౌజర్ ఏదైనా ఇటీవల కాలంలో జావాస్క్రిప్ట్‌ను చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనవల్ల వినియోగదారుడు వెబ్సైట్లో ఏదైనా క్లిక్ చేయగానే వేగంగా ప్రాసెస్ అవుతుంది. లోపాలు, బగ్‌ల ఆధారంగా పరీక్షించడం, సవరించడం జావాస్క్రిప్ట్‌తో సులభం. ఏ బ్రౌజర్ అయినా జావాస్క్రిప్ట్ కోడ్‌ను రన్ చేస్తుంది. ఎలా పని చేస్తుంది వెబ్ బ్రౌజర్లలో జావాస్క్రిప్ట్, ఇతర కోడ్లను అనువదించే ఇంజన్లు ఉంటాయి. అవి జావాస్క్రిప్ట్లోని కమాండ్స్‌కు అనుగుణంగా డైనమిక్ చర్యలకు దోహదపడతాయి. బాగా రాసిన, ఆప్టిమైజ్ చేసిన కోడ్ ..వెబ్‌పేజీలను సమర్ధవంతంగా ఓపెన్ చే స్తుంది. సరిగ్గా లేని ఆదేశాలతో కూడిన జావాస్క్రిప్ట్ యూజర్ బ్రౌజర్‌ను నెమ్మదించేలా చేస్తుంది. ఎవరు నేర్చుకోవచ్చు వెబ్డెవలప్మెంట్పై ఆసక్తి ఉన్నవారు ముందుగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొని.. ఆ తర్వాత జావాస్క్రిప్ట్‌పై దృష్టిసారించాలి. ఆన్‌లైన్‌లోనూ అనేక ఉచిత మెటీరియల్, ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. జావాస్క్రిప్ట్ కమాండ్స్(ఆదేశాలు) ఇంగ్లిష్ మాదిరిగా ఉండటం వల్ల దీన్ని నేర్చుకోవడం సులభం. జావాస్క్రిప్ట్‌లో ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు లభించిన తర్వాత.. ప్రోగ్రామింగ్‌లో కెరీర్ ప్రారంభించొచ్చు. జావాస్క్రిప్ట్ స్టడీ గ్రూప్‌లలో చేరడం ద్వారా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. కెరీర్ అవకాశాలు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సొంతం చేసుకుంటే.. లక్షల్లో వేతనాలు పొందొచ్చు. అన్ని కంపెనీల్లో జావాస్క్రిప్ట్ వినియోగం పెరగడం వల్ల రానున్న రోజుల్లో జావాస్క్రిప్ట్ డెవలపర్లకు మరింత డిమాండ్ పెరగనుంది. నిపుణులైన జావాస్క్రిప్ట్ డెవలపర్లను చాలా కంపెనీలు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, జావాస్క్రిప్ట్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్, వెబ్ డిజైనర్, యూఐ డిజైనర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డెవ్‌ఓప్స్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా డెవలపర్లుగా పనిచేయొచ్చు. -
సముద్ర గర్భంలో భూకంపం: తప్పిన సునామీ ముప్పు
బాలి: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన పర్యాటక ప్రాంతం బాలికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. అయితే ప్రకంపనలు సముద్ర గర్భంలో రావడంతో అందరూ సునామీ వస్తుందని భయపడ్డారు. కానీ అలాంటి ముప్పేమీ లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. ఇండినేషియాకు సమీపంలోని ద్వీపకల్పం బాలి, జావా సమీపంలో సముద్ర గర్భాన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూ ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైందని అక్కడి అధికారి రహ్మత్ ట్రియోరీ తెలిపారు. ఈ ధాటికి ద్వీపకల్పంలోని కొన్ని భవనాలు కూలిపోయాయి. దీంతో ఆరుగురు మృతి చెందారు. అయితే సముద్ర గర్భంలో ప్రకంపనలు రావడంతో సునామీ వచ్చే ముప్పు ఉందేమోనని స్థానికులు భయాందోళన చెందారు. సునామీ వచ్చే అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు జావాకు 82 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భాన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. -
కోడింగ్ బాయ్
భువనేశ్వర్ : ప్రజంట్ జనరేషన్ పిల్లలంతా తమ ప్రతిభాపాటవాలతో వండర్ కిడ్స్‌గా పేరు గడిస్తున్నారు. తాజాగా ఒడిషాలో బాలంగీర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల వెంకట్ రామన్ పట్నాయక్ ఈ లిస్టులో చేరాడు. బీటెక్,ఎంసీఏ చదివిన విద్యార్థులే కోడింగ్ సరిగ్గా అర్థంకాక పొగ్రామ్స్ రాయడానికి కుస్తీలు పడుతుంటారు.అటువంటిది మూడో తరగతి చదువుతున్న వెంకట్ రామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌ను ఇట్టే క్లియర్ చేశాడు. జావా, జావా స్క్రిఫ్ట్, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్‌లో మొత్తం 160 క్లాసులకు హాజరై ఆయా కోర్సుల్లో పట్టుసాధించాడు. అంతేగాక సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించే మైక్రోసాఫ్ట్ట్ టెక్నాలజీ అసోసియేట్ (ఎంటీఏ) ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్‌ను పొందాడు. (చదవండి: ఈ ‘కోడ్’ తప్పదిక) 2019 మార్చిలో ఓ యాప్ ద్వారా కోడింగ్ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించిన వెంకట్ ఏడేళ్ల వయసులోనే ఏకంగా 250 అప్లికేషన్స్‌కు కోడింగ్ రాసి ఔరా అనిపించాడు. ఒకప్పుడు టెక్నాలజీ పిల్లలకు ఆమడదూరంలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపే టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. -
మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!
దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్ సైకిల్ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్ బ్రాండ్ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్ లాంబ్రెటాను డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్ లాంబ్రెటా డిజైనింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎక్స్‌పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మిలన్లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) భారత్‌లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్ సూపర్ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్ఐఎల్ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్ ఇండియాతో ట్రేడ్‌మార్క్ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది. లోహియా ఆటోతో జట్టు.. భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం మార్కెట్.. విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి. ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్ బ్రాండ్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. అయితే, వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!! -
మృత్యు సునామీ.. 222 మంది మృతి
ఇండోనేసియాను మరో జల విలయం ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాలకు తరచూ గురయ్యే ఈ ద్వీప సముదాయ దేశంలో తాజాగా ఓ సునామీ మృత్యు పాశమై పెను విధ్వంసం సృష్టించింది. శినివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడింది. సముద్రం నుంచి దూసుకొచ్చిన మృత్యు అలలు క్షణాల్లో 222 మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మందిని గాయాలపాలు చేశాయి. బలమైన అలల తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కెరీటా ఇండోనేసియాలో మరో భారీ ప్రకృతి విలయం సంభవించింది. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా సునామీ రావడంతో 222 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానంలో శనివారం రాత్రి 8 గంటలు) సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది.సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయని అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం తెలిపింది. కాగా, ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఇండోనేసియాకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘ఇండోనేసియాలో సునామీ కారణంగా జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని చింతిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల నేతలు ఇండోనేసియాకు సానుభూతి తెలిపారు. సెవెంటీన్ పాప్ గ్రూప్‌పై.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపడుతున్నామనీ, మొత్తంగా 28 మంది గల్లంతయ్యారని ఇండోనేసియా జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సునామీ కారణంగా 222 మంది మరణించగా, మరో 843 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. సుండా జలసంధి సమీపంలోని తీరాల్లో, జావా ద్వీపంలోని పాండెగ్లాంగ్ జిల్లాలో 163 మంది చనిపోయారనీ, అత్యధిక మరణాలు రెండు హోటళ్లలో సంభవించాయని నుగ్రోహో చెప్పారు. సెరంగ్లో 11 మంది, సుమత్రా దీవిలోని దక్షిన లంపుంగ్లో 48 మంది చనిపోయారన్నారు. ఈ సునామీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ వీడియో భీతి గొల్పేలా ఉంది. ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. అనంతరం అల ప్రేక్షకులను ముంచెత్తింది. సునామీ కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. శిథిలాలు, చెత్త, చెదారమంతా బీచ్‌ల్లోకి చేరింది. జావా ద్వీపంలోని కెరీటా బీచ్‌లోకి ఓ ఇంటి పైకప్పుకు అమర్చిన రేకులు, మొద్దులు, ఇతర శిథిలాలు కొట్టుకొచ్చాయి. సునామీ సమయంలో అగ్ని పర్వతం ఫొటోలు తీస్తున్న ఓయ్స్టీన్ అండర్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘అకస్మాత్తుగా ఓ పెద్ద అల వచ్చింది. అది తీరం దాటి దాదాపు 20 మీటర్లు ముందుకొచ్చింది. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన అల తీరంలోని హోటల్ ప్రాంతాన్ని ముంచేసింది. కార్లు, కంటెయినర్లు 10 మీటర్లకు పైగా దూరం కొట్టుకుపోయాయి’ అని చెప్పారు. మొత్తం మృతుల సంఖ్య అప్పుడే చెప్పలేం సునామీ మృతుల సంఖ్య స్పష్టంగా తెలిసేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చని రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీస్ అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన కేథీ ముల్లర్ తెలిపారు. శిథిలాలను పూర్తిగా తొలగించేంత వరకు మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేమనీ, రాబోయే కొన్ని రోజులు, వారాల పాటు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని ఆమె అన్నారు. సహాయక బృందాలు గాయపడిన వారిని వైద్యశాలలకు తరలిస్తున్నాయి. తమ సంస్థల తరఫున సహాయక శిబిరాలు నెలకొల్పి ప్రజలకు తాత్కాలిక వసతిని, ఆహారాన్ని అందజేస్తున్నట్లు కేథీ చెప్పారు. సునామీ కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు తమ బృందాలు సిద్ధమవుతున్నాయన్నారు. కాగా, ఇండోనేసియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయి. ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలోనూ సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో సునామీ వచ్చి వేలాది మంది చనిపోయారు. 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేసియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు. పేలిన అగ్నిపర్వతం సుమత్రా, జావా ద్వీపాల మధ్యలో పేలిన ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం వీధి విధ్వంసం సునామీలో పూర్తిగా ధ్వంసమైన వీధి, వాహనాలు శవాల దిబ్బ కవర్లలో చుట్టిన మృతదేహాల్లో తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు -
ఇండోనేషియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ
-
సునామీ ప్రతాపం.. 228 మంది మృతి
జకార్తా: దీవుల దేశం ఇండోనేషియాను సునామీ మరోసారి ముంచెత్తింది. శనివారం అర్థరాత్రి సమయంలో సంభవించిన సునామీ ధాటికి 228 మంది మరణించగా, 700మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ ప్రతాపాన్ని చూపించింది. అలలు తీవ్రంగా విరుచుకుపడడంతో వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.మృతుల్లో అత్యధికులు విదేశీ పర్యాటకులేనని అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ సుమ్రతా, జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు ఆదేశ విపత్తు నిర్వహణ అధికారి పుర్వో నుర్గోహో తెలిపారు. సునామీ ధాటికి కొంతమంది గల్లంతయ్యారని వారికోసం గాలింపుచర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
జావసత్త్వాలు
జావలను ఇక్కడ ఇచ్చిన పదార్థాలతోనే కాదు... జొన్నలు, కొర్రలు, సజ్జలు వంటి రకరకాల చిరుధాన్యాలతోనూ తయారుచేసుకోవచ్చు. ఇష్టాన్ని బట్టి పాలు, బెల్లం కలిపి తియ్యగాను, మజ్జిగ ఉప్పు కలిపి ఉప్పగానూ తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు రుచిగా ఉండటం కోసం వెనిలా, స్ట్రాబెర్రీ, చాకొలేట్ వంటి ఎసెన్స్ జత చేసి అందించవచ్చు. ఎవరికి నచ్చిన డ్రైఫ్రూట్స్‌ను వారు జావలో జత చేసుకుని తాగవచ్చు. మీ సృజనకు పదునుపెట్టండి. జావ అనగానే జావగారిపోవలసిన అవసరం లేదు. జావలో జీవం ఉంది.జవం... అంటే వయసుకు శక్తినిచ్చే ధాతువు ఉంది. ఎండలలో శరీరానికి గొడుగు పట్టాలంటే జావ తాగాలి.రాగి, సగ్గుబియ్యం, బార్లీ, గోధుమరవ్వ...వీటితో జావ కాచండి, మాట వినకుండా ఆటలలోకి పరుగెత్తే పిల్లలకు ఇవ్వండి.వారిని అదుపుచేయలేక నీరసపడే మీరు కూడా కాస్త పుచ్చుకోండి.ఈ సెలవులు శక్తితో నిండుతాయి. సరదాగా గడుస్తాయి. రాగి జావ(తియ్యగా) కావలసినవి:రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పాలు – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – నాలుగు చుక్కలు; ఏలకుల పొడి – చిటికెడు; డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా తయారీ:∙ఒక పాత్రలో, పాలు, నీళ్లు, రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙పంచదార లేదా »ñ ల్లం పొడి వేసి బాగా కలపాలి ∙నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి జావలో వేసి అందించాలి. గోధుమ రవ్వ జావ కావలసినవి: గోధుమ రవ్వ – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి, కొత్తిమీర – కొద్దికొద్దిగా; తరిగిన అల్లం – అర టీ స్పూను తయారీ:∙ముందుగా రవ్వను బాణలిలో పొడిగా వేయించుకోవాలి ∙రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ∙రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి జతచేసి కలిపి దింపేయాలి. ∙చివరగా అల్లం తరుగు, కొత్తిమీర జత చేసి అందించాలి. ∙ఇష్టపడేవారు ఇందులో మజ్జిగ జత చేసుకుని తాగవచ్చు. సగ్గు బియ్యం జావ (తియ్యగా) కావలసినవి:సగ్గు బియ్యం – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – 3 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ:∙సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, కుకర్‌లో ఉంచి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. ∙పాలు జత చేసి బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. ∙బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం పొడి లేదా పంచదార జత చేసి మరోమారు కలపాలి. ∙ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి దించేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి తీసేసి, జావలో కలపాలి. బార్లీ జావ కావలసినవి: బార్లీ – ఒక కప్పు; నీళ్లు – ఐదు కప్పులు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; తేనె – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 2; దాల్చిన చెక్క పొడి – చిటికెడు; అల్లం ముక్క – చిన్నది తయారీ: బార్లీని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు, వెల్లుల్లి రెబ్బ, దాల్చిన చెక్కపొడి జత చేసి, సన్నని మంట మీద సుమారు అరగంట సేపు మూడు వంతులు అయ్యేవరకు మరిగించి, దింపి చల్లారాక వడబోయాలి∙జావను ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లగా తాగవచ్చు లేదా మామూలుగానే చల్లారిన తరవాత నిమ్మరసం, తేనె జత చేసి తీసుకోవచ్చు. రాగి జావ (ఉప్పగా) కావలసినవి: రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; మజ్జిగ – తగినంత; నెయ్యి – నాలుగు చుక్కలు; జీలకర్ర – చిటికెడు; కరివేపాకు – ఒక రెమ్మ; కొత్తిమీర – కొద్దిగా; పచ్చి మిర్చి – 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి) తయారీ:ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసి రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న నీళ్లలో పోసి ఉడికించి దింపేయాలి ∙చల్లారాక ఉప్పు, మజ్జిగ జత చేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న జావలో వేసి కలపాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి బాగా కలిపి అందించాలి. సగ్గు బియ్యం జావ (ఉప్పగా) కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నిమ్మరసం – టీ స్పూను; మజ్జిగ – రెండు కప్పులు; పుదీనా ఆకులు – కొద్దిగా; నీళ్లు – మూడు కప్పులు తయారీ:సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాక, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి.బాగా చల్లారాక మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం జత చేసి మరోమారు కలిపి, పుదీనా ఆకులు వేసి అందించాలి. దూరంగా ఉండాలి పదార్థాలను నూనెలో డీప్‌ఫ్రై చేసి చాలామంది తింటుంటారు. రెస్టారెంట్లలోను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోను ఈ ఫ్రైలను విరివిగా తయారుచేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలకు రుచి ఎక్కువ. కాని ఇలా తయారయిన వాటిలో క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. అందువల్ల రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, ఒబేసిటీ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం మెండుగానే ఉంటుంది. టైప్– 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేయించిన పదార్థాలు తప్పనిసరిగా తినాలకునునేవారు... కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, అవొకాడో నూనె వాడుకోవడం కొంతవరకు పరవాలేదు. అవెన్‌లో వేయించుకోవడం మరో మార్గం. అప్పడాల వంటివి నేరుగా అవెన్‌లో నూనె లేకుండా వేయించుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫ్రయింగ్లో వేయించినా కూడా కొంతవరకు నష్టం తగ్గుతుంది. ఆవిరి మీద ఉడికించిన పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయనే విషయాన్ని మరచిపోకూడదు. ఆరోగ్యాన్ని ప్రసాదించే జావలు మనకి ప్రధాన ఆహారధాన్యాలు ‘వరి, గోధుమ, బార్లీ, కొర్రలు, రాగులు, జొన్నలు’ మొదలైనవి. ఇవి వండేటప్పుడు నీటిని అధికంగా చేర్చి పల్చగా ఉండేలా ఉడికించి, వాటిని మనం ‘జావలు’ అంటాం. ఇలాంటి జావలను రకరకాల పేర్లతో ఆయుర్వేదం అభివర్ణించింది. అసలు ద్రవ్యానికి ఎన్ని రెట్లు నీళ్లు కలిపితే ఎంత పలచగా ఉంటుందీ లేక ఎంత చిక్కగా అవుతుంది అన్న అంశాలను చాలా లోతుగా విశదీకరించింది ఆయుర్వేదం. ఆ పలుచని లేక చిక్కదనాన్ని బట్టి కొన్ని సాంకేతిక పదాలను సూచించింది. ఉదాహరణకు అతి పల్చగా ఉంటే ‘పేయం’ కొంచెం చిక్కగా ఉంటే ‘మండము’ అని స్పష్టీకరించింది. ఇలాంటివే అనేక సాంకేతిక పదాలు ఉన్నాయి. ఈ జావలని ప్రధాన ఆహారధాన్యాలతోనే కాకుండా, కొన్ని పప్పుల (పెసర, మినప) తో కూడా చేసుకోవచ్చు. పాలను ఉపయోగించి చేస్తే, ‘క్షీర కృతములు’ అని, మాంసరసంతో చేస్తే ‘మాంసకృతములు’ అని స్పష్టం చేసింది. కొన్ని శాకాలతో (ముల్లంగి, చిక్కుడు, సొరకాయ, గాజర) కూడా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాధులలో పథ్యంగా కొన్ని ఔషధ ద్రవ్యాల్ని కూడా కలుపుకోవచ్చని ఆయుర్వేదం చెప్పింది. (శొంఠి, పిప్పలి, మిరియాలు, తిప్పతీVð....వంటివి) దానిమ్మ వంటి ఫలాలతో చేసిన జావలని ‘జల’ అని చెబుతారు. కొన్ని ఆకుకూరలు, పేలాలతో కూడా జావలు తయారుచేసుకోవచ్చు. ప్రయోజనాలు తేలికగా జీర్ణమై, అజీర్ణాన్ని పోగొట్టి, నాలుకకు రుచిని కలిగించి, జఠరాగ్నిని ఉత్తేజ పరుస్తుంది. తద్వారా తిన్న ఆహారం పచనానంతరం రక్తంలో చేరి ధాతుపుష్టి కలుగుతుంది. పొట్టలోని వాయువుని (ఆధ్మానం) హరిస్తుంది. పేలాలతో చేసిన జావ దప్పిక, ఎక్కిళ్లను తగ్గిస్తుంది. శొంఠి కలిపిన జావ తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.క్షీరము (పాలు), శర్కర (పంచదార) కలిపిన వాటిని పాయసం అని సూచించి, ఇది శక్తివర్థకమని స్పష్టం చేసింది ఆయుర్వేదం. జీర్ణశక్తి బాగా ఉన్నప్పుడు మాత్రమే పాయసం సేవించాలి. ఫలాలతో చేసిన జావ తేలికగా జీర్ణమై, బలాన్ని కలిగిస్తుంది. పెసలతో చేసిన జావ గొంతుకను శుద్ధి చేస్తుంది. కంటిచూపుకు మంచిది.మినుములతో చేసిన జావ కృశత్వాన్ని హరిస్తుంది. ఈ విషయాలకు సంబంధించి కాశ్యప సంహిత ఇలా చెబుతోంది – రోచనోదీపనో వృష్యః స్వరవర్ణ బలాగ్నికృత్ప్రస్వేద జననో ముఖ్యః తుష్టి పుష్టి సుసావః – డాక్టర్ వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకు లకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్.mail : familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. -
యూజర్లకు గూగుల్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మెసెజింగ్ సర్వీస్ జీమెయిల్ యూజర్లకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ కొన్ని సూచనలు చేసింది. వచ్చే ఫిబ్రవరి 13 నుంచి జీమెయిల్ యూజర్లు జావా స్ర్కిప్ట్ ఫైళ్లను రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల వైరస్ ల కారణంగా జీమెయిల్ యూజర్లను ఇందుకు సంబంధించిన ఫైళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 తర్వాత నుంచి జావా స్క్రిప్ట్ ఫైళ్లను సెండ్ చేస్తే మెస్సేజ్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని డైలాగ్ బాక్స్ వస్తుందని సంస్థ తెలిపింది. యూజర్లకు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వైరస్ల నుంచి ఇన్‌బాక్స్, సెంట్ మెయిల్స్, ఇతరత్రా డాటాను సెక్యూర్ చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జీమెయిల్ నుంచి .exe, .msc, and .bat ఫైళ్లను, వీటికి సంబధించిన ఫైల్ అటాచ్‌మెంట్స్‌ను పంపడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో .జేఎస్ (జావా స్క్రిప్ట్) ఫైళ్లను వేరే యూజర్లను పంపాల్సి వస్తే అందుకు గూగుట్ డ్రైవ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర స్టోరేజ్ సౌకర్యం ఉన్న సర్వీసు నుంచి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చునని గూగుల్ వివరించింది. జీమెయిల్ సర్వీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి 26 మంది చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి రెండు నదులు ఉప్పొంగడంతో ఒక్క గారట్ జిల్లాలోనే 17 మంది మరణించగా, 13 మంది కనిపించకుండా పోయారు. చనిపోయిన వారిలో 8 నెలల పసికందుతోపాటు 8 మంది చిన్నపిల్లలున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఇండోనేషియాలో జూన్ లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. -
యువ.. ఎదురీదారు.. ఎదిగారు
వారు కష్టాల కడలికి ఎదురీదారు. నమ్ముకున్న రంగాల్లో అనుకున్నది సాధించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి అన్ని పరీక్షలనూ తట్టుకున్నారు. తరగని ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదిగారు. బతుకుపోరులో విజేతలుగా నిలిచారు. యువతరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్న యువకుల విజయగాథలివి. - హనుమా/నాగరాజు అట్టడుగు స్థాయి నుంచి.. జీవితంలో అధఃపాతాళాన్ని చూశాను. నేనప్పుడు ఒకటో క్లాసు. సొంతూరు రాజమండ్రి నుంచి.. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేశాం. నాన్న ఆర్మీలో జవాను. ఆయన జీతం తిండికే సరిపోయేది కాదు. ఇరుకు గదిలో మేం ఆరుగురం కాపురం. నేను తొమ్మిదో తరగతికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి మరీ దిగజారింది. అప్పుడే ఇంట్లో ఉన్న చిల్లరంతా పోగేసి పతంగులు కొని పాతబస్తీలో అమ్మాను. అదే నా మొదటి సంపాదన. తర్వాత రోడ్లపై చిప్స్, సిటీబస్సుల్లో ఫ్రూటీ వంటివి అమ్మాను. కొంతకాలం హీరో జగపతిబాబు ఫ్యాన్స్‌కు జవాబులు రాసే ఉద్యోగం చేశా. ఏడో తరగతి నుంచి డిగ్రీ (బీఎస్సీ కంప్యూటర్స్) వరకు మెరిట్ స్కాలర్షిప్స్తోనే చదువు పూర్తిచేశా. ఊహ వచ్చాక నాదొకటే కల.. ఫారిన్ వెళ్లి బాగా సంపాదించాలని! డిగ్రీ పూర్తయ్యాక సత్యం కంప్యూటర్స్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం వచ్చింది. ఖాళీ సమయాల్లో అక్కడే ఇంటర్నెట్ సాయంతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. సత్యంలోనే వెబ్‌డిజైనర్ పోస్టు ఖాళీ అయితే, అది నాకిచ్చారు. నాకదే పెద్ద టర్నింగ్ పాయింట్. కంపెనీ తరఫున సింగపూర్ సహా వివిధ దేశాల్లో పనిచేశా. 2003-04లో సత్యం తరఫున వరల్డ్ బ్యాంకులో ప్రాజెక్ట్ డెవలపర్‌గా విధులు నిర్వర్తించా. అప్పటి నా జీతం నెలకు రూ.1.75 లక్షలు. సొంత కంపెనీ పెట్టాలనే ఆలోచనతో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చేశా. ఫారిన్లో చదివొస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారని మిత్రులు సలహా ఇవ్వడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలో చేరేందుకు యూకేలోని ససెక్స్ యూనివర్సిటీకి అప్లయ్ చేశా. వెంటనే ఆఫర్ లెటర్ వచ్చింది. వీసా కోసం చెన్నై బయలుదేరా. పాస్‌పోర్ట్ ఆఫీసు ముందు పెద్ద క్యూ. ఎంతకూ కదలడం లేదు. ఇక ఎలాగైనా కంపెనీ పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యాను. క్యూ మధ్యలోనే వదిలేసి తిరిగి సిటీకి వచ్చేశా. నేను రూ.65 లక్షలు, మిత్రులు మరో రూ.30 లక్షలు పెట్టి 2005లో నౌపాజ్ కంపెనీ స్థాపించాం. అంచెలంచెలుగా వందకోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. కొన్ని కారణాల వల్ల 2011లో నేను నా షేర్లు విత్‌డ్రా చేసుకున్నా. అదే ఏడాది పాసిబిలియన్ టెక్నాలజీస్, దానికి అనుబంధంగా ఐడియేటివ్ డిజిటల్ సంస్థలు ప్రారంభించా. ఇవి మొబైల్ యాప్స్ తయారు చేసే సంస్థలు. మా ఉత్పత్తులకు భారత్‌లో కంటే నెదర్లాండ్స్, అమెరికాల్లోనే మంచి బిజినెస్ ఉంది. నా భార్య మహాలక్ష్మి నేచురోపతి డాక్టర్. మా కంపెనీలో భాగస్వామి కూడా. కసితో పనిచేశా.. ఉన్నతి సాధించా.. అయినా చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. - అయ్యప్ప, నౌపాజ్ కంపెనీ వ్యవస్థాపకుడు కెమెరానే నమ్ముకుని.. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అందుకే ఇంటర్ అయిపోగానే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేశా. జేఎన్టీయూలో ఫొటోగ్రఫీ కోర్సులో చేరాను. సెకండియర్లోనే నా ఫ్రెండ్‌తో కలసి ఎస్సార్ నగర్లో స్టూడియో ఓపెన్ చేశా. తొలిరోజుల్లో స్టూడియో అద్దె డబ్బులకు కూడా తడుముకోవాల్సి వచ్చేది. గణపతి నవరాత్రులకు కాలనీలో ఫ్రీగా ఫొటోలు తీశాను. ఎవరైనా అడిగితే ప్రింట్లు తీసి ఇచ్చేవాడిని. తొమ్మిదిరోజులు పూర్తయ్యాక నాకొచ్చింది అరవై రూపాయలే. కానీ నా గురించి కాలనీలో అందరికీ తెలిసింది. నెలాఖరు నాటికి నా అకౌంట్లో వెయ్యి రూపాయల మిగులు కనిపించడానికి ఏడేళ్లు పట్టింది. కాస్త బిజీ కాగానే స్టూడియోను కృష్ణానగర్‌కు షిఫ్ట్ చేసేశా. అక్కడ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యా. తక్కువ ధరకు ఆర్టిస్ట్‌లకు ఫొటో షూట్స్ చేసేవాడిని. సినీ పరిచయాలు మొదలవడంతో ‘6టీన్స్’ సినిమాకు ఫొటోషూట్ చేసే అవకాశం వచ్చింది. సుమంత్ హీరోగా చేసిన ‘సత్యం’ సినిమా డెరైక్టర్ సూర్యకిరణ్ నాకు మంచి స్నేహితుడు. అనుకోకుండా ఓ రోజు సుమంత్ ఫ్రెండ్ బ్యాచ్‌లో నన్ను ఓ పాత్ర చేయమన్నారు. అందులో ‘రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా..’ పాట నేను రాసిందే. రాజేష్‌తో కలసి పాడాను కూడా. తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్, జల్సా, నమో వెంకటేశ మూవీల్లో కనిపించా. అయితే, సినిమాలను నమ్ముకోవాలా.. లెన్స్ పట్టుకోవాలా అన్న డైలమాలో నా మనసు ఫొటోలే తీయమని చెప్పింది. వెంటనే సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశా. ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా మారాక చిరంజీవి, రామ్‌చరణ్ తేజ్, కాజల్, తమన్నా, తాప్సీ వంటి టాలీవుడ్ తారలకు ఫొటో షూట్స్ చేశా. లాక్మే, లారియల్ వంటి ఫ్యాషన్ పెరేడ్స్కూ వర్క్ చేశా. విదేశాల్లోని తెలుగువారి పెళ్లిళ్లకు కూడా ఫొటోలు తీశాను. మనదేశంలో ఫేస్బుక్ వెరిఫై చేసిన మొట్టమొదటి ఫొటోగ్రఫీ పేజీ నాదే. ఇప్పటికి దీనికి 8 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. నాకు నచ్చిన కళ ఫొటోగ్రఫీ, నా జీవిత భాగస్వామి ప్రియ.. ఈ రెండూ కలిసొచ్చేలా ‘ఫోట్రియా’ పేరుతో ఇన్స్టిట్యూట్ ప్రారంభించా. యూఎస్, యూకే, న్యూజిలాండ్ సహా దేశంలోనూ పలు నగరాల్లో ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌లు నిర్వహించా. ప్రస్తుతం యాభై మందికి శిక్షణ ఇస్తున్నా. వారిలో ముప్ఫయి మందికి ఉచితంగానే నేర్పిస్తున్నా. ఫ్యూచర్లో సిటీలోని ఫొటోగ్రాఫర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు అసోసియేషన్ ఏర్పాటు చేయాలని ఉంది. - కచాక్ వెంకీ -
జావాతో జాబ్స్ ఎన్నో...
ఐటీ కోర్సు.. JAVA,J2SE,J2EE,J2ME నేటి సాంకేతిక ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.. కొలువుల దశ, దిశలను మార్చేస్తోంది. నచ్చిన టెక్నాలజీని, మార్కెట్ మెచ్చేటట్లు ఒంటబట్టించుకుంటే కెరీర్ పూలపాన్పు అవుతుంది. ఇలాంటి టెక్నాలజీలో ఒకటి ‘జావా’.. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని సహాయంతో వెబ్ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయొచ్చు. వెబ్‌సైట్స్, చాట్ అప్లికేషన్స్ వంటి వాటిని రూపొందించవచ్చు. జావా అనేది ప్లాట్‌ఫాం ఇండిపెండెంట్ లాంగ్వేజ్. దీని సహాయంతో అభివృద్ధి చేసిన అప్లికేషన్స్‌ను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తోనైనా పనిచేయించవచ్చు. జావా సెక్యూరిటీ పరంగా కూడా పటిష్టమైంది. కోర్సుకు ఎవరు అర్హులు: బీఈ/బీటెక్;ఎంసీఏ;ఎంఎస్సీ(సీఎస్/ఐటీ) కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు జావా కోర్సును నేర్చుకోవచ్చు. బీఎస్సీ (సీఎస్ లేదా ఐటీ)ని మంచి మార్కులతో పూర్తిచేసిన వారు ఈ కోర్సులో చేరొచ్చు. ఇతర ఐటీ సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారు కూడా కోర్సులో అడుగుపెట్టొచ్చు. మార్కెట్లో అనేక ఐటీ శిక్షణ సంస్థలు స్వల్పకాలిక జావా కోర్సును అందిస్తున్నాయి. కోర్సులో ప్రవేశించాలనుకునే అభ్యర్థికి కనీసం సి- లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి. మూడు మాడ్యూల్స్: పూర్తిస్థాయి జావా కోర్సులో ముఖ్యంగా మూడు మాడ్యూళ్లు ఉంటాయి. అవి... 1: జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ (జే2ఎస్ఈ). 2. జావా 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ (జే2ఈఈ). 3. జావా 2 మైక్రో ఎడిషన్ (జే2ఎంఈ). కోర్సులో చెప్పే అంశాలు: కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, హైబర్నేట్, స్ప్రింగ్స, స్ట్రట్స్, వెబ్ సర్వీసెస్ తదితర అంశాలతోపాటు మొబైల్ సంబంధిత అప్లికేషన్స్ పరిజ్ఞానాన్ని నేర్పిస్తారు. కెరీర్ అవకాశాలు: ప్రస్తుతం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించిన వారికి ఉన్నత కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న స్థాయి ఐటీ కంపెనీ నుంచి కార్పొరేట్ స్థాయి కంపెనీల వరకు జావా డెవలపర్స్‌ను నియమించుకుంటున్నాయి. ప్రతిభగల వారికి ఉన్నత పే ప్యాకేజీలతో ఆహ్వానం పలుకుతున్నాయి. టాప్ రిక్రూటర్స్: ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఐబీఎం, ఇన్ఫోటెక్, గూగుల్, విప్రో జావా- ఇంటర్వ్యూ ప్రశ్నలు: ఫ్రెషర్స్‌కు అయితే కోర్ జావాపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. Ex: oops, Exception Handling, I/O streams, Multi Threading, Collections, AWT's, Applets, JDBC, Servlets, JSP, etc. ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై లోతుగా ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ సంబంధిత బీటెక్ కోర్సుల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లకు సంబంధించిన అంశాలను బోధిస్తారు. ఇందులో భాగంగా జావా ప్రాథమిక అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వచ్చిన వెంటనే జావా ఆధారంగా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే ఔత్సాహికులు పూర్తిస్థాయి కోర్సులో చేరి పరిజ్ఞానం సంపాదించవచ్చు. తరగతిలో చెప్పిన పాఠ్యాంశాలను ఏ రోజుకారోజే ల్యాబ్‌లో నిజాయతీగా ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఫ్యాకల్టీ సహకారంతో సొంతంగా అప్లికేషన్స్‌ను డెవలప్ చేసేందుకు ప్రయత్నించాలి. Inputs: అహ్మద్ షరీఫ్, సీనియర్ ఫ్యాకల్టీ, పీర్స్ టెక్నాలజీస్, హైదరాబాద్.