ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి | Indonesia floods: 26 dead, 19 missing, says official | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి

Published Thu, Sep 22 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

Indonesia floods: 26 dead, 19 missing, says official

జకర్తా: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి 26 మంది చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి రెండు నదులు ఉప్పొంగడంతో ఒక్క గారట్‌ జిల్లాలోనే 17 మంది మరణించగా, 13 మంది కనిపించకుండా పోయారు.

చనిపోయిన వారిలో 8 నెలల పసికందుతోపాటు 8 మంది చిన్నపిల్లలున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఇండోనేషియాలో జూన్ లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement