ఐటీ కోర్సు.. JAVA,J2SE,J2EE,J2ME
నేటి సాంకేతిక ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.. కొలువుల దశ, దిశలను మార్చేస్తోంది. నచ్చిన టెక్నాలజీని, మార్కెట్ మెచ్చేటట్లు ఒంటబట్టించుకుంటే కెరీర్ పూలపాన్పు అవుతుంది. ఇలాంటి టెక్నాలజీలో ఒకటి ‘జావా’..
జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని సహాయంతో వెబ్ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయొచ్చు. వెబ్‌సైట్స్, చాట్ అప్లికేషన్స్ వంటి వాటిని రూపొందించవచ్చు.
జావా అనేది ప్లాట్‌ఫాం ఇండిపెండెంట్ లాంగ్వేజ్. దీని సహాయంతో అభివృద్ధి చేసిన అప్లికేషన్స్‌ను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తోనైనా పనిచేయించవచ్చు. జావా సెక్యూరిటీ పరంగా కూడా పటిష్టమైంది. కోర్సుకు ఎవరు అర్హులు:
బీఈ/బీటెక్;ఎంసీఏ;ఎంఎస్సీ(సీఎస్/ఐటీ) కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు జావా కోర్సును నేర్చుకోవచ్చు.
బీఎస్సీ (సీఎస్ లేదా ఐటీ)ని మంచి మార్కులతో పూర్తిచేసిన వారు ఈ కోర్సులో చేరొచ్చు. ఇతర ఐటీ సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారు కూడా కోర్సులో అడుగుపెట్టొచ్చు.
మార్కెట్లో అనేక ఐటీ శిక్షణ సంస్థలు స్వల్పకాలిక జావా కోర్సును అందిస్తున్నాయి.
కోర్సులో ప్రవేశించాలనుకునే అభ్యర్థికి కనీసం సి- లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి.
మూడు మాడ్యూల్స్:
పూర్తిస్థాయి జావా కోర్సులో ముఖ్యంగా మూడు మాడ్యూళ్లు ఉంటాయి.
అవి...
1: జావా 2 స్టాండర్డ్ ఎడిషన్ (జే2ఎస్‌ఈ).
2. జావా 2 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ (జే2ఈఈ).
3. జావా 2 మైక్రో ఎడిషన్ (జే2ఎంఈ).
కోర్సులో చెప్పే అంశాలు:
కోర్ జావా, అడ్వాన్స్‌డ్ జావా, హైబర్‌నేట్, స్ప్రింగ్‌స, స్ట్రట్స్, వెబ్ సర్వీసెస్ తదితర అంశాలతోపాటు మొబైల్ సంబంధిత అప్లికేషన్స్ పరిజ్ఞానాన్ని నేర్పిస్తారు.
కెరీర్ అవకాశాలు:
ప్రస్తుతం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించిన వారికి ఉన్నత కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న స్థాయి ఐటీ కంపెనీ నుంచి కార్పొరేట్ స్థాయి కంపెనీల వరకు జావా డెవలపర్స్‌ను నియమించుకుంటున్నాయి. ప్రతిభగల వారికి ఉన్నత పే ప్యాకేజీలతో ఆహ్వానం పలుకుతున్నాయి.
టాప్ రిక్రూటర్స్:
ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్,
ఐబీఎం, ఇన్ఫోటెక్, గూగుల్, విప్రో
జావా- ఇంటర్వ్యూ ప్రశ్నలు:
ఫ్రెషర్స్‌కు అయితే కోర్ జావాపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు.
Ex: oops, Exception Handling, I/O streams, Multi Threading, Collections, AWT's, Applets, JDBC, Servlets, JSP, etc.
ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై లోతుగా ప్రశ్నలు అడుగుతారు.
కంప్యూటర్ సంబంధిత బీటెక్ కోర్సుల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లకు సంబంధించిన అంశాలను బోధిస్తారు. ఇందులో భాగంగా జావా ప్రాథమిక అంశాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వచ్చిన వెంటనే జావా ఆధారంగా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే ఔత్సాహికులు పూర్తిస్థాయి కోర్సులో చేరి పరిజ్ఞానం సంపాదించవచ్చు.
తరగతిలో చెప్పిన పాఠ్యాంశాలను ఏ రోజుకారోజే ల్యాబ్‌లో నిజాయతీగా ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఫ్యాకల్టీ సహకారంతో సొంతంగా అప్లికేషన్స్‌ను డెవలప్ చేసేందుకు ప్రయత్నించాలి.
Inputs:
అహ్మద్ షరీఫ్,
సీనియర్ ఫ్యాకల్టీ, పీర్స్ టెక్నాలజీస్, హైదరాబాద్.
జావాతో జాబ్స్ ఎన్నో...
Published Thu, Dec 19 2013 1:50 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement