![Tsunami Alert Issued In Indonesia - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/2/sunami.gif.webp?itok=znnmWX4e)
జకార్తా: ఇండోనేసియాలో శుక్రవారం భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ముందుస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. బాంటన్ కోస్ట్, జావాలాంటి సముద్ర తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలు.. అక్కడి ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లాలని సునామీ హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇండోనేసియాను ఇటీవల కాలంలో వరుస భూకంపాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలను ప్రారంభించారు. తీర ప్రాంత ప్రజలను మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment