చెన్నై విమానానికి తప్పిన పెనుముప్పు! | chennai-jakarta flight escaped accident | Sakshi
Sakshi News home page

చెన్నై విమానానికి తప్పిన పెనుముప్పు!

Published Wed, Jun 21 2017 7:08 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

చెన్నై విమానానికి తప్పిన పెనుముప్పు! - Sakshi

చెన్నై విమానానికి తప్పిన పెనుముప్పు!

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంచి జకార్తా బయలుదేరిన విమానానికి పెనుముప్పు తప్పింది. చెన్నై విమానాశ్రయం నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు జకార్తా విమానం బయలుదేరింది. విమానంలో వివిధ దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

గగనతలంలో 35 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయాన్ని కెప్టెన్‌ గుర్తించి.. వెంటనే కంట్రోల్‌ రూంకు సమాచారం ఇచ్చాడు. 6.45 గంటలకు విమానాన్ని సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చి ల్యాండ్‌చేశాడు. ప్రయాణికులకు సమీపంలోని హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. విమానానికి మరమ్మతులు చేసి గురువారం ఉదయం మరలా జకార్తాకు పంపుతారాని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement