![Viral Video: Intoxicated Passenger Fight With Flight Attendants Bite Finger - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/10/18/Flight.jpg.webp?itok=o9A7_qIu)
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్‌లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు.
దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్‌కి మళ్లించారు.
ఈ మేరకు మెడాన్‌లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చ్ చేస్తోంది.
(చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది)
Comments
Please login to add a commentAdd a comment