kaulalampur
-
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్‌లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్‌లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
చెన్నై తీరానికి దగ్గర్లోనూ గాలింపు
ఇంకా లభించని మలేసియా విమానం ఆచూకీ న్యూఢిల్లీ/కౌలాలంపూర్:అదృశ్యమై వారం రోజులైనా.. మలేసియా విమానం జాడ ఇంకా లభించలేదు. మలక్కా జలసంధి నుంచి అండమాన్ ప్రాంతం వరకూ జరిపిన అన్వేషణలో ఫలితం కనిపించకపోవడంతో.. శుక్రవారం బంగాళఖాతం వరకు గాలింపును విస్తరించారు. మలేసియా ప్రభుత్వ విజ్ఞప్తిపై భారత్ గాలింపు పరిధిని బంగాళాఖాతంలో 9 వేల చదరపు కి.మీకిపైగా పెంచింది. ఈ ప్రాంతం చెన్నై తీరానికి 300 కి.మీ దూరంలో ఉంది. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండొచ్చని అమెరికా రక్షణ, వైమానిక నిపుణులు చెప్పడంతో గాలింపు ప్రాంతాన్ని విస్తరించాలని మలేసియా భారత్‌ను కోరింది. కాగా, శాటిలైట్ సమాచారాన్ని, చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఆ విమానం జాడ కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ప్రయత్నిస్తోంది. వారం క్రితం మలేసియా నుంచి బీజింగ్‌కు ఐదుగురు భారతీయులు సహా 239 మందితో వెళుతున్న విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. దాని ఆచూకీ కోసం భారత్ సహా 13 దేశాలకు చెందిన 48 విమానాలు, 57 నౌకలు గాలిస్తున్నాయి. అమెరికా రక్షణ, వైమానిక శాఖ సూచనల ప్రకారం.. గాలింపు చర్యలను హిందూ మహాసముద్ర ప్రాంతానికి విస్తరించారు. అయితే, ఆ విమానం అండమాన్ వైపు వెళ్లి ఉండవచ్చని ఒకవైపు, కాదు ప్రస్తుతం గాలిస్తున్న ప్రాంతానికి దూరంగా వెళ్లి ఉండవచ్చని మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ రెండింటినీ కొంద రు వైమానిక నిపుణులు కొట్టిపడేస్తున్నారు. మరోవైపు విమానం రాడార్ల నుంచి అదృశ్యమైన నాలుగు గంటల అనంతరం దాని నుంచి ఒక ఉపగ్రహానికి సిగ్నల్స్ వచ్చాయని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అవి సహాయం కోసం విమానం నుంచి పంపిన సిగ్నల్స్ అయి ఉంటాయని పేర్కొన్నారు. విమానం జాడను కనుగొనేందుకు ఒక ముస్లిం మత గురువును ఆశ్రయించినట్లు వచ్చిన వార్తలను మలేసియా ఖండించింది. అదృశ్యమైన విమానం టేకాఫ్ అయిన కౌలాలంపూర్ విమానాశ్రయంలో... ఇబ్రహీం మత్‌జిన్ అనే మతగురువు పూజలు చేస్తున్న చిత్రాలు, వీడియోలు విస్తతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దానితో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని ప్రకటించింది.