ఢిల్లీ: శీతాకాల సమావేశంలో సభ సజావుగా సాగాలనే ఉద్దేశంతో రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని మార్చినా సభలో ఆందోళనలకు తెరపడలేదు. రాజ్యసభలో 11 గంటలకే ప్రశ్నోత్తరాల సమయం మొదలయ్యేది. అయితే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఈ సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. కానీ హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ దే శీయ టెర్మినల్‌కు ఉన్న రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో మారిన ప్రశ్నోత్తరాల సమయం వృథా అయింది.