భివండీ, న్యూస్‌లైన్: ఉర్దూ భాషకు మహారాష్ట్రలో సముచిత స్థానం లభించిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం జరిగిన జి.ఎం.మోమిన్ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన అఖిల భారతీయ ఉర్దూ మహా సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉర్దూ భాష తన అస్తిత్వాన్ని కాపాడుకుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషను సరిగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం గౌరవం లభించిందన్నారు.
ఉర్దూ భాష ఉనికిని కాపాడడం కోసం జీ.ఎం. మోమిన్ గర్ల్స్ కళాశాల ఇటువంటి మహాసమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా చేపట్టాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉర్దూ భాష వికాసం కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కె.శంకరనారాయణన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫౌజియాఖాన్, ఠాణే జిల్లా ఇంచార్జి మంత్రి గణేశ్ నాయిక్, మైనారిటీ శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూకు ‘మహా’ గౌరవం
Published Sat, Nov 23 2013 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement