సాక్షి, ముంబై: మహారాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని భీవండీ పట్టణంలోని ట్రాన్స్‌జెండర్ తలపై బండతో కొట్టి హత్య చేసిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీబస్తీ ప్రాంతానికి చెందిన హిజ్రా (ట్రాన్స్‌జెండర్) తౌహిక్‌తో లాహోటి ప్రాంతానికి చెందిన స్నేహితుడు కామిల్ జమీల్ అన్సారీ గత కొన్ని నెలలుగా అసహజ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య పరస్పర తగాదాలు నెలకొన్నాయి.
ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు రోడ్డుపై ఇదే విషయమై మరోసారి ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. కోపంతో ట్రాన్స్‌జెండర్ బెబ్బొ తలపై జమీల్ బలమైన రాయితో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం అనేక మంది హిజ్రాలు భీవండి పట్టణ పోలీస్ స్టేషన్ చుటుముట్టి వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ చేతన్ కాకడే ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
చదవండి: ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment