![మాయావతి రాజీనామా ఆమోదం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41500577683_625x300.jpg.webp?itok=b8wWibkV)
మాయావతి రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ను చైర్‌పర్సన్ హమీద్ అన్సారీ ఆమోదించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులు, హింస గురించి సభలో మాట్లాడే అవకాశం తనకు ఇవ్వడంలేదని అధికార బీజేపీ, చైర్‌పర్సన్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె బుధవారం 3 పేజీల రాజీనామా లేఖ రాశారు. అయితే, దానిని చైర్‌పర్సన్ తిరస్కరించారు. దీంతో నిర్దేశిత ఫార్మాట్‌లో తన సొంత దస్తూరితో రాసిన ఏక వాక్య రాజీనామా లేఖను తిరిగి అందించగా చైర్‌పర్సన్ ఆమోదించారు. మాయావతి రాజీనామాను డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది.