ఉప రాష్ట్రపతి అన్సారీ దంపతులను సన్మానించిన ఎన్నారైలు
భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులను లండన్లోని ఎన్నారైలు గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఏన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్రిటన్లోని భారత రాయబారి డాక్టర్ వీరేంద్ర పౌల్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. స్థానిక ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తలు లార్డ్ స్వరాజ్ పాల్, లార్డ్ గులాం నూన్, లార్డ్ కరణ్ బిల్మెరా, లార్డ్ లార్ పాపట్ తదితర అతిరథ మహారథులంతా ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అక్స్ఫర్డ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్లో సిటీజన్ షిప్ అండ్ ఐడెంటిటీ అనే అంశంపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉపన్యాసం చేయనున్నారు.భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మూడు దేశాల పర్యటనలో భాగంగా క్యూబా, పెరూ దేశాలలో పర్యటించారు. అనంతరం హవానా చేరుకున్నారు. అక్కడి నుంచి నిన్న ఉదయం లండన్ చేరుకున్నారు.