
'ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలి'
ఢిల్లీ: గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో శనివారం రాజ్యసభకు చెందిన అఖిలపక్ష నేతలతో హమీద్ భేటీ అయ్యారు.
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారిని ఉపరాష్ట్రపతి కోరినట్టు సమాచారం.