
ఆమెకు తొలి అవార్డు
బ్యాంకాక్: మొట్టమొదటి ప్రపంచ సంస్కృతం అవార్డుకు థాయ్‌లాండ్ యువరాణి, సంస్కృత భాషాకోవిదులు మహాచక్రీ సిరింధ్రోన్‌ను భారత్ ఎంపిక చేసింది. ఈ మేరకు అవార్డు అందుకోవాల్సిందిగా భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ శుక్రవారమి క్కడ ఆమెను కలసి ఆహ్వానించారని భారత విదేశీ వ్యవహారాల (తూర్పు) కార్యదర్శి అనిల్ వాద్వా తెలిపారు. గత ఏడాది బ్యాంకాక్‌లో అంతర్జాతీయ సంస్కృతం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని సుమారు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.