న్యూఢిల్లీ: ‘మీ మీద చాలా పెద్ద బాధ్యతలతో కూడిన అంచనాలున్నాయి. కానీ మీరు నాకు సహకరించడంలేదు. ఈ మధ్య బిల్లులెందుకు ఆమోదం కావట్లేదు’అని ప్రధాని మోదీ ముందస్తు సమాచారం లేకుండా తన గదిలోకి వచ్చి ప్రశ్నించారని మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక పూర్వకంగా, అసాధారణంగా ఆయన మాట్లాడినట్లు హమీద్ వెల్లడించారు. మోదీకి అతిథి మర్యాదలు చేసిన అనంతరం తన పనేమిటో రాజ్యసభకు, ప్రజానీకానికి తెలుసని సమాధానమిచ్చినట్లు తాను రాసిన పుస్తకం ‘బై మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్’లో హమీద్ అన్సారీ పేర్కొన్నారు.
ఎన్డీఏ తనకు వచ్చిన మెజారిటీని చూసి రాజ్యసభ ప్రక్రియలను, విధివిధానాలపై కూడా నైతిక హక్కును ఇచ్చినట్లు భావించిందని వ్యాఖ్యానించారు. అంతేగాక రాజ్యసభ టీవీ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంలేదని అడిగినట్లు చెప్పారు. తాను రాజ్యసభ చానెల్ ఏర్పాటులో భాగంగా ఉన్నప్పటికీ, ఎడిటోరియల్‌పై తనకు నియంత్రణ లేదని, రాజ్యసభ కమిటీ ఆయా వ్యవహారాలను చూసుకుంటోందని, అందులో వస్తున్న కార్యక్రమాలపై ప్రజలను హర్షిస్తున్నాయని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment