రాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన గురువారం హమీద్ అన్సారీకి పార్టీల కతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు.