
నాంపెన్ : చుట్టూ నలుగురు చూస్తున్నారనే సభ్యత మరిచి శృంగార భంగిమలతో కూడిన నగ్న డ్యాన్స్‌లు (పోర్నోగ్రఫిక్ డ్యాన్స్‌లు) చేస్తున్న పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. వారిని ఆదివారం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. వాదోపవాదాలు పూర్తయితే వారికి ఏడాదిపాటు జైలు శిక్ష పడనుంది. ఈ ఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు బ్రిటన్ పౌరులు, ఇద్దరు కెనడియన్లు, ఒకరు న్యూజిలాండ్ పౌరుడు కాగా మరో ఇద్దరు కాంబోడియా వాళ్లు.
వీళ్లు గత ఏడు నెలలుగా టూరిజం పేరిట కాంబోడియాకు వచ్చి పలు పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ అసభ్యతకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా శృంగారత్వంతో నిండిన పాటలు పాడుతూ, శృంగార భంగిమల్లో డ్యాన్స్‌లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. దీంతో వీరిపై కొద్ది రోజులుగా కన్నేసిన పోలీసు అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా వారి చేష్టలు ఉన్నాయని, అందుకే వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారిలో ఒకరిద్దరు జువెనైల్స్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment