దేశంలోని మెకంగ్ నదీ వరద పోటెత్తింది. దాంతో 168 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ అధికార ప్రతినిధి కియో వై మంగళవారం కంబోడియా రాజధాని నామ్ ఫెన్ లో వెల్లడించారు. ఆ వరదల వల్ల 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయారని తెలిపారు. రూ.500 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు.
దాదాపు 500 హెక్టార్ల వరి పంట వరదల వల్ల నీట మునిగిందన్నారు. అలాగే దేశంలోని 240 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రావెన్స్లు వరద నీటిలో మునిగి ఉన్నాయన్నారు.