Mekong River
-
ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు!
ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. సుమారు 13 అడుగుల పొడవు, దాదాపు 300 కేజీల బరువు ఉంది అది. కంబోడియా మెకాంగ్ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పదలు సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాక్కొరు. ఖేమర్ భాషలో క్రిస్టెన్డ్ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్లో ‘మాంస్టర్ ఫిష్’ షో నిర్వాహకుడు జెబ్ హోగన్.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు. మెకాంగ్ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. -
కంబోడియాలో వరదలు:168 మంది మృతి
దేశంలోని మెకంగ్ నదీ వరద పోటెత్తింది. దాంతో 168 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ అధికార ప్రతినిధి కియో వై మంగళవారం కంబోడియా రాజధాని నామ్ ఫెన్ లో వెల్లడించారు. ఆ వరదల వల్ల 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయారని తెలిపారు. రూ.500 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. దాదాపు 500 హెక్టార్ల వరి పంట వరదల వల్ల నీట మునిగిందన్నారు. అలాగే దేశంలోని 240 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రావెన్స్లు వరద నీటిలో మునిగి ఉన్నాయన్నారు. -
విమానం కూలి 49 మంది మృతి
లావోస్‌లో దుర్ఘటన బ్యాంకాక్: లావోస్‌లో 44 మంది ప్రయాణికులు సహా ఐదుగురు వైమానిక సిబ్బంది జల సమాధి అయ్యారు. మొత్తం 49 మందితో కూడిన లావోస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూవీ-301 విమానం బుధవారం రాజధాని వియంటైన్ నుంచి పక్సే పట్టణానికి బయల్దేరింది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా అననుకూల వాతావరణం నేపథ్యంలో మెకాంగ్ నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారని లావో ప్రభుత్వం వెల్లడించింది. చనిపోయిన వారిలో 11 దేశాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొంది. విమానంలోని సగ భాగం పూర్తిగా నదిలో మునిగిపోయిందని, మృత దేహాలు చెల్లా చెదురుగా ఒడ్డున పడ్డాయని వివరించింది.