విమానం కూలి 49 మంది మృతి | Lao crash: 49 people, mostly foreigners, killed as plane goes down in Mekong River | Sakshi
Sakshi News home page

విమానం కూలి 49 మంది మృతి

Published Thu, Oct 17 2013 1:23 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Lao crash: 49 people, mostly foreigners, killed as plane goes down in Mekong River

 లావోస్‌లో దుర్ఘటన
బ్యాంకాక్: లావోస్‌లో 44 మంది ప్రయాణికులు సహా ఐదుగురు వైమానిక సిబ్బంది జల సమాధి అయ్యారు. మొత్తం 49 మందితో కూడిన లావోస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూవీ-301 విమానం బుధవారం రాజధాని వియంటైన్ నుంచి పక్సే పట్టణానికి బయల్దేరింది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా అననుకూల వాతావరణం నేపథ్యంలో మెకాంగ్ నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారని లావో ప్రభుత్వం వెల్లడించింది. చనిపోయిన వారిలో 11 దేశాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొంది. విమానంలోని సగ భాగం పూర్తిగా నదిలో మునిగిపోయిందని, మృత దేహాలు చెల్లా చెదురుగా ఒడ్డున పడ్డాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement