Man Killed By 40 Crocodiles After He Tries To Move One In Cambodia - Sakshi
Sakshi News home page

72 ఏళ్ల వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు దాడి!

Published Fri, May 26 2023 1:58 PM | Last Updated on Fri, May 26 2023 2:40 PM

Man Killed By 40 Crocodiles After He Tries To Move One At Cambodia - Sakshi

ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి. ఈ షాకింగ్‌ ఘటన కంబోడియాలో చోటు చేసుకుంది. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల కోసం ఎన్‌క్లోజర్‌ నుంచి మొసలి తరలించాలనుకున్నాడు 72 ఏళ్ల వృద్ధుడు. అందుకోసం అతను ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకుంటే అది రివర్స్‌లో అతడి కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది.

ఈ హఠాత్పరిణామానికి ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అక్కడే ఉన్న 40 మొసళ్లు అతనిపై మూకుమ్మడి దాడి చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కంబోడియాలోని సియెమ్‌ రీప్‌ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్‌క్లోజర్‌లు ఉన్నాయి. అక్కడివారు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. అక్కడి వారు వాటితో గుడ్లు, మాంసం, చర్మం తదితరాల వ్యాపారం చేస్తుంటారు. 

(చదవండి: చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement