ఫ్నోమ్ పెన్: వివాహ రిసెప్షన్పై ఓ దుండగుడు గ్రైనెడ్ విసిరి విధ్వంసం సృష్టించాడు. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. కంబోడియాలోని కంపాంగ్ దోమ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది.
ఆ సమయంలో బంధువులు, మిత్రులు నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కంపాంగ్ దోమ్ మిలిటరీ పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ దాడికి ముక్కోణపు ప్రేమకథ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని, ముక్కోణపు ప్రేమకథే దాడికి ప్రేరేపించి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు.
వివాహ రిసెప్షన్పై గ్రైనెడ్తో దాడి.. 9 మంది మృతి
Published Sun, Jan 26 2014 12:37 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement