nine killed
-
బస్టాండ్ స్లాబ్ కూలి తొమ్మిదిమంది మృతి
-
టాంకర్ని ఢీకొట్టిన టెంపో 9మంది మృతి
-
శివకాశీలో భారీ అగ్నిప్రమాదం
-
శివకాశీలో భారీ అగ్నిప్రమాదం
9 మంది మృతి.. 20 మందికి తీవ్రగాయాలు బాణసంచా గిడ్డంగిలో పేలుళ్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని శివకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా గిడ్డంగి వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పక్కనున్న స్కాన్‌సెంటర్‌కు దట్టమైన పొగలు వ్యాపించటంతో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. 20మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. శివకాశీ బైపాస్ రోడ్డులోని ప్రయివేటు బాణసంచా గిడ్డంగి వద్ద ఈ ఘటన జరిగింది. రిటైల్ దుకాణాలకు సరుకు చేరవేసేందుకు గురువారం మధ్యాహ్నం 20 మంది కూలీలు బాణ సంచా బండిళ్లను రెండు వ్యాన్లలోకి సర్దుతున్నారు. ఇంతలోనే బండిళ్లలోని టపాసులు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని టపాసులు పేలి మంటలు గిడ్డంగి లోకి వ్యాపించటంతో ఎగసిపడ్డాయి. స్కాన్ సెంటర్లోనే..: గిడ్డంగిలోనుంచి మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవకీ స్కాన్ సెంటర్లోకి దట్టమైన పొగచూరుకుంది. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా రోగులు వైద్య పరీక్షల కోసం స్కాన్ సెంటర్‌కు వచ్చారు. హఠాత్తుగా దట్టమైన పొగ వారిని చుట్టుముట్టడంతో అందులో ఉన్న వారంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. కొందరు స్థానికులు.. స్కాన్ సెంటర్ వెనుకవైపు కిటికీని బద్దలు కొట్టి లోపల చిక్కుకున్న వారిలో కొందరిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కొందరు దట్టమైన పొగకారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడకే చనిపోయారు: గిడ్డంగి సమీపంలో మంటలను మొదట్లోనే ఊహించిన బయటనున్న కూలీలు, స్థానికులు, పక్కనున్న దుకాణ దారులు పారిపోయారు. కానీ ప్రమాదాన్ని గుర్తించని స్కాన్‌సెంటర్లో కూర్చున్న వారు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అయితే మృతులంతా మంటల వల్ల చనిపోలేదని.. దట్టమైన పొగలతో ఊపిరాడకే మృతిచెందారని కలెక్టర్ శివజ్ఞానం తెలిపారు. గిడ్డంగి లోపలినుంచి బయటకెళ్లే ప్రయత్నంలో గాయపడిన కూలీలను శివకాశీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 15 స్కూటర్లు, ఒక జీపు, బాణ సంచా తరలింపునకు సిద్ధం చేసుకుని ఉన్న రెండు మినీ వ్యాన్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ దాదాపు గంటసేపు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చింది. బాణసంచా తయారీ గిడ్డంగి, దుకాణ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణే శివార్లలోని ఓ పత్తి ఫ్యాక్టరీలో గురువారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. -
భారీ వర్షాలకు 9 మంది మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాని భారీ వర్షం అతలాకుతలం చేస్తుంది. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చురుకుగా సాగుతున్నాయి. అందులోభాగంగా దూళిపాళ వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతులు రైల్వే అధికారులు చేపట్టారు. భారీ వర్షం, ఈదురుగాలులకు రెడ్డిగూడెంలో దాదాపు 30 వేల కోళ్లు మృతి చెందారు. గుంటూరు - హైదరాబాద్ మధ్య మూడో రోజు కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు ప్రాంతంలో చెరువులకు గండ్లు పడ్డాయి. వాటి మరమ్మతులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో చెరువులోని నీరు పలు గ్రామాల్లోకి వచ్చి చేరింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది మరణించారని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో బస్సు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తట్టాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. కరాచీ నుంచి బస్సు షదాద్ కోట్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం శనివారం అర్థరాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
మూడు ట్రక్కులు డీ: తొమ్మిది మంది మృతి
బీజింగ్: చైనా షాంగ్జి ప్రావిన్స్‌లోని యజ్హో నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని జాతీయ రహదారిపై బుధవారం మూడు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది రహదారిపై పనులు చేస్తున్న పనివారని చెప్పారు. మరోకరు ట్రక్కులోని వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
మెక్సికో: మెక్సికో ఈశాన్య రాష్ట్రమైన తములిపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారని చెప్పింది. అలాగే మృతుల్లో ఐదుగురిని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడని వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్ కార్యాలయం చెప్పింది. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 14 మంది మృతి
కాబూల్: అఫ్ఘానిస్థాన్లోని ఓ హోటల్లో సాయుధులు తెగబడ్డారు. కాబూల్‌లోని విదేశీయుల అతిథి గృహంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ మృతులు ఇద్దరిలో ఒకరు తెలుగువారు కూడా ఉన్నట్లు అనధికారికంగా సమాచారం వచ్చింది. దీన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. పార్క్ ప్యాలెస్ హోటల్ అనే భవనాన్ని వారు లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులను కూడా పోలీసులు హతమార్చారు. కాబూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ తాలిబన్లు స్థావరాలు ఏర్పాటు చేసుకునే ఉన్నారు. దీంతో కాబూల్ లక్ష్యంగా ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువయ్యాయి. అందులోనూ విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ హోటల్లో సాయుధుల చెరలో చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులు, ఇతర దేశీయులే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరి క్షేమం ఆకాంక్షించారు. వారికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. -
అల్ షబాబ్ దాడిలో తొమ్మిది మంది మృతి
మొగాదిషు: సోమాలియాలో అల్ షబాబ్ సంస్థకు ఉగ్రవాదులు చేసిన బాంబుల దాడిలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ముందస్తు వ్యూహం ప్రకారం ప్రభుత్వ పాలనా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు బాయిడోవా అనే నగరంలో వివిధ చోట్ల బాంబులు పేల్చారు. ముఖ్యంగా బాయిడోవా ప్రెసిడెంట్ షరీఫ్ హసన్ షేక్ అదాన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసానికి సమీపంలో బాంబులు పేల్చారు. ఈ బాంబులు పేలిన ప్రాంతాల్లో ఆఫ్రికన్ యూనియన్, యూనైటెడ్ నేషన్స్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ బాంబుల వల్ల గాయపడినవారిలో సైనికులు కూడా ఉన్నారు. -
వివాహ రిసెప్షన్పై గ్రైనెడ్తో దాడి.. 9 మంది మృతి
ఫ్నోమ్ పెన్: వివాహ రిసెప్షన్పై ఓ దుండగుడు గ్రైనెడ్ విసిరి విధ్వంసం సృష్టించాడు. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. కంబోడియాలోని కంపాంగ్ దోమ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో బంధువులు, మిత్రులు నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడని కంపాంగ్ దోమ్ మిలిటరీ పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ దాడికి ముక్కోణపు ప్రేమకథ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్య కాదని, ముక్కోణపు ప్రేమకథే దాడికి ప్రేరేపించి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు.