గుంటూరు : గుంటూరు జిల్లాని భారీ వర్షం అతలాకుతలం చేస్తుంది. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చురుకుగా సాగుతున్నాయి. అందులోభాగంగా దూళిపాళ వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతులు రైల్వే అధికారులు చేపట్టారు. భారీ వర్షం, ఈదురుగాలులకు రెడ్డిగూడెంలో దాదాపు 30 వేల కోళ్లు మృతి చెందారు.
గుంటూరు - హైదరాబాద్ మధ్య మూడో రోజు కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు ప్రాంతంలో చెరువులకు గండ్లు పడ్డాయి. వాటి మరమ్మతులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో చెరువులోని నీరు పలు గ్రామాల్లోకి వచ్చి చేరింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9 మంది మరణించారని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు.