![Ys Jagan Is Shocked At The Accidents Due To Heavy Rains](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/31/Ysjaganmohanreddy7.jpg.webp?itok=9Luqfflz)
మృతుల కుటుంబాలకు సంతాపం
ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు మరణించిన ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉదృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్ సహా ఇద్దరు విద్యార్ధులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండ చరియలు విరిగిపడి వృద్దురాలు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో భారీవర్షాల బాధితులకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment