రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి | Nine killed in Mexico road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

Published Fri, May 15 2015 8:15 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Nine killed in Mexico road accident

మెక్సికో: మెక్సికో ఈశాన్య రాష్ట్రమైన తములిపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారని చెప్పింది. అలాగే మృతుల్లో ఐదుగురిని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడని వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్ కార్యాలయం చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement