ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు : ఇద్దరు మృతి | two killed in road accident in PSR Nellore district | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు : ఇద్దరు మృతి

Published Thu, Aug 18 2016 9:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

two killed in road accident in PSR Nellore district

నెల్లూరు : నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నరసారెడ్డి కండ్రిక సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గూడూరు డిపోకు చెందిన బస్సు తిరుపతి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్ మునీంద్ర అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్ అనే ప్రయాణికుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గూడూరు డిపో మేనేజర్ అనిల్ కుమారుకు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... మరో బస్సలో ప్రయాణికులకు తిరుపతి పంపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement