Ten injured
-
వేర్వేరు ప్రమాదాల్లో పది మందికి గాయాలు
పార్వతీపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం కొత్తవలసకు చెందిన కత్తిరి శ్రీనును స్థానిక రైల్వేగేట్ వద్ద పాలకొండ నుంచి పార్వతీపురం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. – బైక్ బోల్తా.. విజినిగిరి (జామి) : మండలంలోని విజినిగిరి వద్ద బైక్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నానికి చెందిన ఎస్కే అబ్దుల్ (35) విజినిగిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చి, తిరుగు ప్రయాణంలో విజినిగిరి యోగాశ్రమం వద్ద బైక్ బోల్తా పడడంతో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడ్ని 108 వాహనంలో విజనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. – ట్రాక్టర్ ఢీకొని ఒకరు.. బొబ్బిలి : ట్రాక్టర్ ఢీ కొనడంతో ఉపాధ్యాయ సంఘ నాయకుడు గాయపడిన సంఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. కురమాన జోగారావు ద్విచక్ర వాహనంపై పారాది నుంచి బొబ్బిలి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో జోగారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రడ్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. ఏఎస్సై సీహెచ్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ కెల్ల వెంకటరమణను అరెస్ట చేశారు. ద్విచక్రవాహనం నుంచి జారిపడి పార్వతీపురం టౌన్ : ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ఒకరు గాయపడ్డారు. గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన బోను తాతబాబు గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి గొట్టివలస వస్తుండగా రేగిడి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో గాయాలపాలైన తాతబాబును స్థానికులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు : ఇద్దరు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నరసారెడ్డి కండ్రిక సమీపంలో రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గూడూరు డిపోకు చెందిన బస్సు తిరుపతి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్ మునీంద్ర అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్ అనే ప్రయాణికుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గూడూరు డిపో మేనేజర్ అనిల్ కుమారుకు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... మరో బస్సలో ప్రయాణికులకు తిరుపతి పంపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. -
బస్సుబోల్తా...పది మందికి గాయాలు
నర్సాపూర్(మెదక్): బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిమంది గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం నర్సాపూర్-తుప్రాన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డికి వెళుతుండగా.. హన్మంతాపూర్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందిలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పిచ్చి కుక్క స్వైర విహారం
నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది. బుధవారం ఉదయం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను నల్గొడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిరేకల్... ఆ సమీపం ప్రాంతంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనిపై స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన.. వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. -
బస్సు బోల్తా: పది మందికి గాయాలు
కోడుమూరు(కర్నూలు): కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. డోన్ డిపో ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో కోడుమూరు నుంచి లద్దగిరి వైపు వెళుతోంది. వెంకటగిరి సమీపంలో ఆటోను తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా.. పది మందికి గాయాలు
మదనపల్లి: చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దమండ్యం మండల కేంద్రం సమీపంలో ముందు వెళుతున్న ఆటోను అధిగమించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
మెక్సికో: మెక్సికో ఈశాన్య రాష్ట్రమైన తములిపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారని చెప్పింది. అలాగే మృతుల్లో ఐదుగురిని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడని వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్ కార్యాలయం చెప్పింది. -
వోల్వో బస్సు బోల్తా!
మెదక్: సంగారెడ్డి మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. బైకును తప్పించబోయి వోల్వో బస్సు బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళుతోంది. గాయపడినవారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. **