మెదక్: సంగారెడ్డి మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. బైకును తప్పించబోయి వోల్వో బస్సు బోల్తాపడింది. కర్ణాటకకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి ముంబై వెళుతోంది.
గాయపడినవారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
**
వోల్వో బస్సు బోల్తా!
Published Sun, Nov 23 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement