
సాక్షి, చిత్తూరు : విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటాఏస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment