Tata Ace
-
భద్రాద్రిలో ఘోర ప్రమాదం.. కిన్నెరసాని వాగులో దూసుకెళ్లి..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండల పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని వేలేరు బ్రిడ్జి పై నుంచి కిన్నెరసాని వాగులో పడింది ఓ ట్రాలీ వాహనం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. వాహనం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఏలూరు జిల్లా(ఏపీ) నర్సాపురం మండలం తిరుమల దేవి పేట కు చెందిన వాళ్లు. భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: మళ్లీ వస్తా అని చెప్పి కానరాని లోకాలకు -
బీర్ల లోడు నేలపాలు.. సీసాల కోసం జనం పాట్లు
అనకాపల్లి: జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకవైపు బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. బీర్లు సీసాల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలను పట్టుకెళితే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. -
టాటా ఏస్ ఎలక్ట్రిక్ డెలివరీలు షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏస్ ఎలక్ట్రిక్ మినీ ట్రక్ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్ పవర్‌ట్రైయిన్‌తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్ఎం గరిష్ట టార్క్‌తో 27 కిలోవాట్ పవర్ మోటార్ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్ ఎలక్ట్రిక్‌ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ఏస్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 20 లక్షల పైచిలుకు ఏస్ వాహనాలు రోడ్డెక్కాయి. -
టాటా ఏస్ ఎలక్ట్రిక్ డెలివరీలు షురూ. ధర ఎంతంటే!
వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏస్ ఎలక్ట్రిక్ మినీ ట్రక్ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్ పవర్‌ట్రైయిన్‌తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్ఎం గరిష్ట టార్క్‌తో 27 కిలోవాట్ పవర్ మోటార్ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్ ఎలక్ట్రిక్‌ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ఏస్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 20 లక్షల పైచిలుకు ఏస్ వాహనాలు రోడ్డెక్కాయి. -
‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’
నాగారం: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్. పదేళ్లుగా హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శ్రీనివాస్ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్ వాహనంలో ఆమె మృతదేహాన్ని వేసుకొని స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్‌చేసి ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యి మృతిచెందింది. పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి’ అని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. బీపీ డౌన్ అయ్యి మృతిచెందిందని గ్రామస్తులతో చెప్పగా వారు మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్ తానే చంపానని అంగీకరించాడు. అయితే గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మొగుళ్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు. -
అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్
సాక్షి, చిత్తూరు : విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. బస్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టాటాఏస్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రేణింగట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: ఆగివున్న టాటా ఏస్ వాహనాన్ని మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కలసి చేర్యాల మండలం నాగపురి గ్రామంలో మృతి చెందిన తమ సమీప బంధువైన మల్లేశం అంత్యక్రియలకు టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. రిమ్మనగూడ స్టేజీ వద్దకు రాగానే మరో బంధువు దాచారం నుంచి వస్తున్నానని కబురు పెట్టడంతో పక్కనే వాహనాన్ని ఆపి వేచి చూడసాగారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న లారీ (ఏపీ 15టీవీ 9129) వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో టాటా ఏస్‌లో ఉన్న అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 21 మంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరో ముగ్గురికి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, భూపతిరెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. నిమ్స్ కు తరలించిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కరు మినహా.. అందరి పరిస్థితి విషమం! నిమ్స్‌కు తీసుకు వచ్చిన 21 మంది క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో రాములు (55), చంద్రమ్మ (40), భిక్షపతి (40), చంద్రయ్య (50), అమృతయ్య (55), చంద్రమ్మ (45), స్వామి (40), ఐలమ్మ (40), బాల నర్సయ్య (75), నర్సింహులు (65), భాగ్య (35), కమలమ్మ, పోశయ్య, మ రో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వై ద్యుల ద్వారా తెలిసింది. నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన హరీశ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం క్షతగాత్రుల సహాయకులకు రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలకు తక్షణమే పదివేల రూపాయల చొప్పున స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
టాటా ఏస్ గోల్డ్.. ధర ఎంతంటే.
సాక్షి, ముంబై: దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ టన్ను మినీ ట్రక్ విభాగంలో కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. టన్ను కెపాసిటీ మినీ ట్రక్కు విభాగంలో మేజర్ వాటాను దక్కించుకున్న సంస్థ తాజాగా తొలి నాలుగు చక్రాల మినీ ట్రక్కును విడుదల చేసింది. టాటా మోటర్స్ అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా త్వరలోనే అమ్మకానికి అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా ఏస్ గోల్డ్ పేరుతో లాంచ్ చేసిన దీని ధరను 3.75లక్షల రూపాయలుగా నిర్ణయించింది. టాటా ఏస్ గోల్డ్ వాహనంలో మెరుగుపర్చిన ఫీచర్లను ప్రవేశపెడుతున్నామని టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపార శాఖ అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. తద్వారా తమ వినియోగదారులను మరింత ఆకట్టుకోనున్నట్టు అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు 24గంటలూ మరమ్మత్తు సేవలను , ఉచిత బీమా, సమయానికి రిపేర్ కమిట్మెంట్ లాంటి ఇతర విలువైన సేవలను ఏస్ గోల్డ్ కస్టమర్లకు అందించ నున్నామని పేర్కొన్నారు. కాగా 2005 లో విడుదల చేసిన టాటా ఏస్ 'ఛోటా హాథీ' గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మిని ట్రక్ సెగ్మెంట్లో 68 శాతం వాటాతో గత13 ఏళ్లుగా 20లక్షల యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. -
చిన్నారిని చిదిమేసిన మృత్యుశకటం
అమ్మానాన్న, అక్కతో అంతవరకూ ఆనందంగా గడిపిన అభయం శుభం తెలియని అయిదేళ్ల చిన్నారిని అంతలోనే మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు,అక్క చూస్తుండగానే కర్కశంగా వ్యాన్ రూపంలో పొట్టనపెట్టుకుంది. మొక్కు చెల్లించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నం–తుని రోడ్డులో నాతవరం మండలం తాండవ జంక్షన్లో గురువారం వేగంగా వస్తున్న వ్యాను బ్రేకులు పట్టక వరుసగా మూడు వాహనాలను ఢీకొని బీభత్సవం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. నాతవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కోనే విజయ రామకృష్ణ ,అతని భార్య దేవి, తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి గురువారం ఉదయం దైవదర్శనానికి బయలు దేరారు. రోలుగుంట మండలం సింగరాజుపేట గ్రామంలో గల గంగాలమ్మ తల్లిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. నాతవరం మండలం తాండవ జంక్షన్లో జామకాయలు కోసం ఆగారు. రోడ్డు పక్కన బైక్ నిలిపి, దానిపై విజయరామకృష్ణ, చిన్న కుమార్తె దుర్గశ్రీ కూర్చొన్నారు. భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవి బైక్ దిగి జామ కాయలు కొనుగోలు చేయడానికి దుకాణం వద్దకు వెళ్లారు. వారిద్దరూ జామకాయలను పరిశీలిస్తుండగా ఆ సమయంలో తుని వైపు నుంచి వస్తున్న వ్యానుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ముందు వెళ్తున్న టాటా ఏస్ వ్యానును బలంగా ఢీకొంది. అనంతరం ప్రయాణికులను దించేసి నర్సీపట్నం వైపు నెమ్మదిగా వెళ్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది. టాటా ఏస్ వ్యాను బైక్‌పై ఉన్న విజయరామకృష్ణ, అతని కుమార్తెపై బోల్తా ఢీకొంది. ఈ ప్రమాదంలో కోనె దుర్గశ్రీ (5) అక్కడికక్కడే మృతి చెందింది. విజయరామకృష్ణ తలకు గాయమైంది. బైక్ పూర్తిగా నుజ్జయింది, జామకాయల దుకాణం వద్ద ఉన్న భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవికి స్వల్ప గాయాలయ్యాయి. నాతవరం మండలం వి.బి.ఆగ్రహరం గ్రామానికి చెందిన సుర్ల నాగరత్నం, ముత్యాల దేవి తాండవ జంక్షన్లో గల స్టేట్ బ్యాంకులో డ్వాక్రా సొమ్ము తీసుకోవడం కోసం వచ్చారు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని జామకాయలు కొనుక్కుని ఇంటి వెళ్లిపోదామనుకున్నా రు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో వారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంతవరకు సరదాగా ఉన్న చెల్లెలు అంతలోనే మృత్యువాత పడడంతో అక్క మౌనిక దేవి భోరున విలపించింది. కళ్లముందే కుమార్తెను మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించా రు. ఈసంఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై నాతవరం హెడ్ కానిస్టేబుల్ జి.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
అచ్చంపేట: టాటా ఏస్ ఆటోను, బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం జరగింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నందికొట్కూరులో కల్తీకల్లు స్వాధీనం
–టాటాఏస్ వాహనం సీజ్ నందికొట్కూరు: పట్టణంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించి..1400 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ కల్లు దుకాణాలపై దాడులు చేశామన్నారు. కల్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాడుల్లో ఎక్సైజ్ శాఖ కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీనివాసులు, రమణారెడ్డి, విజయవాడ ఎస్టీఫ్ అధికారి శ్రీకాంత్, నందికొట్కూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు దస్తగిరి, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం..
-
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం
తమిళనాడు(అరియలూర్): తమిళనాడు రాష్ట్రంలోని అరియలూర్ జిల్లా జయగోదమ్ సమీపంలోని కచ్చికులమ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టాటీ ఏసీ వాహనం నుజ్జునుజ్జు అయింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టాటా ఏస్ బోల్తాపడి వృద్ధుడి దుర్మరణం
తొమ్మిది మందికి గాయాలు రేగొండ : టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో అం దులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండలంలోని లింగాల – కొడవటంచ గ్రామాల మధ్య శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మడ్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెరలు హరితహారంలో భాగంగా మొక్కలను నాటే గుంతలు తవ్వేందుకు కూలీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కొడవటంచ శివారు జోగంపల్లి గ్రామానికి చెందిన మిడిమిళ్ల దేవేందర్ టాటాఏస్ వాహనంలో పరకాల నుంచి రేషన్ బియ్యంతో లోడుతో జోగంపల్లికి వెళ్తున్నాడు. జోగంపల్లి మడ్తపల్లికి పక్క గ్రామం కావడంతో కూలీలు మోటపోతుల ఎర్రయ్య(60)తోపాటు మరో తొమ్మిది మంది కూలీలు లింగాల క్రాస్ వద్ద ఆ వా హనాన్ని ఆపి బియ్యం బస్తాలపై ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొడవటంచ – లింగాల గ్రామాల మధ్య మూలుమలుపు వద్ద టాటాఎస్ వాహనం అదుపుతప్పి బో ల్తాపడడంతో ఎర్రయ్య ఎగిరి టాటా ఏస్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో గంధం రమ, రాధ, ఎల్లయ్య, మో టపోతుల భద్రయ్య, మల్లక్క, పవన్, గోళ్ళె న కుమారస్వామి, రమ, సమ్మక్క ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. -
టాటా ఏస్ బోల్తాపడి వృద్ధుడి దుర్మరణం
తొమ్మిది మందికి గాయాలు రేగొండ : టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో అం దులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండలంలోని లింగాల – కొడవటంచ గ్రామాల మధ్య శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మడ్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెరలు హరితహారంలో భాగంగా మొక్కలను నాటే గుంతలు తవ్వేందుకు కూలీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కొడవటంచ శివారు జోగంపల్లి గ్రామానికి చెందిన మిడిమిళ్ల దేవేందర్ టాటాఏస్ వాహనంలో పరకాల నుంచి రేషన్ బియ్యంతో లోడుతో జోగంపల్లికి వెళ్తున్నాడు. జోగంపల్లి మడ్తపల్లికి పక్క గ్రామం కావడంతో కూలీలు మోటపోతుల ఎర్రయ్య(60)తోపాటు మరో తొమ్మిది మంది కూలీలు లింగాల క్రాస్ వద్ద ఆ వా హనాన్ని ఆపి బియ్యం బస్తాలపై ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొడవటంచ – లింగాల గ్రామాల మధ్య మూలుమలుపు వద్ద టాటాఎస్ వాహనం అదుపుతప్పి బో ల్తాపడడంతో ఎర్రయ్య ఎగిరి టాటా ఏస్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో గంధం రమ, రాధ, ఎల్లయ్య, మో టపోతుల భద్రయ్య, మల్లక్క, పవన్, గోళ్ళె న కుమారస్వామి, రమ, సమ్మక్క ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. -
భోగి రోజున అనంత జిల్లాలో విషాదం
-
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఐదుగరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15 లక్షల మార్కును దాటిన టాటా ఏస్
టాటా కమర్షియల్ వెహికిల్స్ ఎస్వీపీ రామకృష్ణన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహన (ఎస్సీవీ) విభాగంలో తన హవాను కొనసాగిస్తోంది. నెలకు సుమారు 12,000 వాహనాలు అమ్ముడవుతున్న ఎస్సీవీ రంగంలో టాటా ఏస్ శ్రేణి 85 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. ఆవిష్కరించిన 10 ఏళ్లలో ఏస్ వాహనాలు 15 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చే శాయి. ఇందులో ప్యాసింజర్ శ్రేణి అయిన ఏస్ మ్యాజిక్, ఏస్ మ్యాజిక్ ఐరిస్ వాహనాలు 4 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇంజన్ రకం, శక్తి, నిర్మాణం ఆధారంగా 12 రకాల ఏస్ వాహనాలను ఇప్పటి వరకు మార్కెట్లోకి తీసుకొచ్చారు. మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా అత్యధికంగా 35 శాతముందని టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. భారత్‌లో అమ్ముడవుతున్న వాణిజ్య వాహనాల్లో అయిదింట ఒకటి టాటా ఏస్ ఫ్యామిలీ నుంచి ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు ఆధునికత జోడిస్తూ అధిక మైలేజీ వచ్చేలా ఈ వాహనాలకు రూపకల్పన చేశామన్నారు. -
గోవులతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా
హైదరాబాద్ : గోవులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం సోమవారం సాయంత్రం బోల్తా కొట్టింది. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 13 గోవులకు తీవ్రగాయాలయ్యాయి. గోవులను వెటర్నరీ ఆసుపత్రికి, డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోతాదుకు మించి గోవులను ఎక్కించుకోవడం వల్ల మూగజీవాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చావుకు వెళ్లొస్తూ..
- ఆరుగురు దుర్మరణం 11 మందికి గాయూలు - టాటా ఏస్‌ను ఢీకొన్న బొగ్గు టిప్పర్ కోల్‌సిటీ/మొగుళ్లపల్లి : గోదావరిఖనిలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన 25 మంది ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. వీరు ప్రయూణిస్తున్న టాటా ఏస్ ట్రాలీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్రగాయూలు కాగా, గోదావరిఖని, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. స్థానిక సింగరేణి పవర్‌హౌస్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన బండారి మల్లయ్య కొన్నేళ్లుగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని న్యూపోరట్‌పల్లిలో ఉంటున్నాడు. ఆయన శుక్రవారం ఉద యం మృతి చెందగా, అంత్యక్రియలకు కుర్కిశాల గ్రామానికి చెందిన బంధువులు టాటా ఏస్ ట్రాలీలో వచ్చా రు. గోదావరి ఒడ్డున సాయంత్రం అంత్యక్రియలు పూర్తరుున తర్వాత తిరిగి వారు స్వగ్రామానికి అదే వాహనంలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వాహనం దారి తప్పింది. గోదావరిఖని నుంచి మంథని మీదుగా కుర్కిశాల వెళ్లేందుకు రాజీవ్ రహదారిపైకి వచ్చారు. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కార్నర్ వద్ద టర్న్ కావాల్సి ఉండగా, దారి తెలియక మంచిర్యాల వైపు వెళ్లిపోయారు. గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత తాము దారి తప్పామని గమనించి స్థానికులను అడిగి వాహనాన్ని వెనక్కు మళ్లించారు. స్థానిక గంగానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి మంథని వైపు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా బొగ్గు టిప్పర్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. అందులో ఉన్న బండారి అనిల్(15), బండారి కుమార్(25), ఆశడపల్లి చిన్నన్న(60), మ్యాదరబోయిన అయిలయ్య(55) అక్కడికక్కడే మృతిచెందారు. స్థాని కులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బండారి లక్ష్మీ(40), అప్పం సమ్మయ్య(45) ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, 8 మందికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కలచివేసిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న, బండారి నాగమల్లు, కేతమ్మ, అప్పం రాజఅయిలయ్య, బండారి ప్రశాంత్, బండారి రాధ, బండారి పుష్ప, బండారి అయిలమ్మ, కొమురక్క తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. ఒకవైపు క్షతగాత్రులు రోదనలు, మరోవైపు మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. మృతుల్లో అప్పం సమ్మయ్య మాజీ సర్పంచ్. వాహ నం డ్రైవర్ మేకల కుమార్‌తోపాటు క్యాబిన్లో కూర్చున్న మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పరామర్శించారు. -
ముగ్గురి జలసమాధి
రావులపెంట (వేములపల్లి) :నాగార్జునసాగర్ ఎడమ ప్రధానకాల్వలో టాటాఏస్ (ట్రాలీఆటో) బోల్తాకొట్టడంతో మగ్గురు జలసమాధి అయ్యారు. మండలంలోని రావులపెంట గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుల బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాములపహడ్ గ్రామానికి చెందిన చింతకాయల నాగయ్య (38), చింతకాయల లింగ య్య (35) ఇద్దరు వరుసకు సోదరులు. వీరు గొర్రెలు, మేకల కొనుగోలు, అమ్మకం వ్యా పారం నిర్వహిస్తుంటారు. శనివారం తెల్లవారుజామున నేరేడుచర్ల మండలం రాంపురం గ్రా మంలో కొనుగోలు చేసిన గొర్రెలను తీసుకొచ్చేందుకు పాములపహడ్ నుంచి ద్విచక్ర వాహనంపై రావులపెంటకు వచ్చారు. గ్రామం లో ట్రాలీఆటోను అద్దెకు మాట్లాడుకుని ద్విచక్రవాహనాన్ని అక్కడే పెట్టి డ్రైవర్ గోలి నాగరాజు(23)తో పాటు లింగయ్య, నాగయ్యలు ఆటోలో ఉదయం నాలుగున్నర గంటలకు బయలుదేరారు. గ్రామానికి కిలోమీటరు దూర ంలో ఉన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ వం తెన మలుపువద్దకు రాగానే కాలువ వంతెన వద్ద రక్షణ లేకపోవడంతో ఆటోకాల్వలో పడిపోయింది. తెల్లవారుజామున కావడంతో ప్రమాదం గురించి ఎవరికీ తెలియలేదు. వెలుగులోకి ఇలా.. లింగయ్య, నాగయ్య ఫోన్లు శనివారం రాత్రి వరకు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆది వారం ఉదయం మృతుల కుటుంబ సభ్యు లు, బంధువులు సాగర్ ఎడమకాల్వకట్ట వెంట గాలింపు జరిపారు. ఈక్రమంలో ఆటోకు సంబంధించిన కొన్ని పరికరాలు బ్రిడ్జి వద్ద కాల్వకట్టపై కనిపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు సర్ధార్‌నాయక్, సతీష్‌కుమార్‌లు చేరుకున్నారు. వారి పర్యవేక్షణలో కాల్వలో గాలించి ఆటోను గుర్తించారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి తాళ్లసహాయంతో ట్రాలీ ఆటోను వెలికితీశారు. మిన్నంటిన బంధువుల రోదనలు.. సాగర్ కాలువలో నుంచి మధ్యాహ్నం మూడు మృతదేహాలను వెలికి తీశారు. తమ వారు ఇక లేరు అని తెలియడంతో, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాలువలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రావులపెంటతో పాటు సమీప గ్రామాలైన పాములపహాడ్, కామేపల్లి గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఘటనస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యే పరామర్శ.. విషయం తెలుసుకుని సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు మృతుల బంధువులను పరామర్శించారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు కరుణాకర్‌రెడ్డి, అరుణమమ్మ, సైదులు, తమ్మడబోయిన అర్జున్, దొం తిరెడ్డి వెంకట్‌రెడ్డి, మోసిన్‌అలీ, శ్రీనివాస్, ఎలియాస్, ఇంద్రారెడ్డి మృ తుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్యాబిన్‌లోనే మృతదేహాలు.. టాటాఏస్ కాల్వలో పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి మృతదేహాలు కూడా ఆటో క్యాబిన్‌లోనే ఉన్నాయి. ఉద యం చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా అద్దాలు పెట్టుకుని డోర్లు లాక్ చేసుకున్నారు.కాలువలో పడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మృ తుడు నాగయ్యకు కుమారుడు,కూతురు, భార్య ఉన్నారు. లింగయ్యకు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు, భార్య, ఆటోడ్రైవర్ నాగరాజుకు వివాహం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
బరాఖత్‌గూడెం(మునగాల): జాతీయ రహదారిపై మునగాల శివారు సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బరాఖత్‌గూడెంకు చెందిన కత్తి గురవయ్య(65) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఆదివారం గేదెలను ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకట్టడంతో గురవయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. మృతుడి కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. టాటా ఏస్ ఢీకొని మహిళ... అక్కలదేవిగూడెం(చివ్వెంల) : టాటా ఏస్ వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కల దేవిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కలదేవిగూడెంకు చెందిన పిడమర్తి కాశమ్మ(40) పొలం దగ్గర నుంచి పశువులను తోలుకొని ఇంటికి వస్తుండగా సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న టాటా ఏస్ వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కాశమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నర్సింహరావు తెలిపారు. రామన్నపేట సమీపంలో యువకుడు.. రామన్నపేట : ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి ఐడియల్ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం కాచారం పంచాయతీ ఆవాస గ్రామానికి చెందిన జంగిడి రాంబాబు(22) చిట్యాలలోని ఓ హోటల్లో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి 2 గంటల సమయంలో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. చిట్యాల-భువనగిరి రహదారిపై ఐడియల్ కంపెనీ దాటిన తరువాత మూల మలుపువద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ ఇండికేటర్స్ వేసి ఉంచకపోవడం, చీకట్లో వాహనం కనిపించకపోవడం మూలంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రెండు వాహనాల ఢీ: ఇద్దరి మృతి
మేడికొండూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ మండలం, జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చిన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి (35), రంగారెడ్డిపాలేనికి చెందిన నాగిరెడ్డి(38)లు ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో ఫిరంగిపురం నుంచి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ద్విచక్ర వాహనంపై వున్న శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిలు ఎగిరి మార్జిన పక్క పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ సమీప బంధువులు. టాటా ఏస్ వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మేడికొండూరు ఎస్ఐ జె. అనూరాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.