Bhadradri Kothagudem Tata Ace Accident Kills Few At Veleru Bridge - Sakshi
Sakshi News home page

భద్రాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. రాములోరి దర్శనం ముగించుకుని వస్తుండగా..

Published Wed, Jun 14 2023 5:56 PM | Last Updated on Wed, Jun 14 2023 6:39 PM

Bhadradri Kothagudem Tata Ace Accident Kills Few At Veleru Bridge - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బుర్గంపాడు మండల పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని వేలేరు బ్రిడ్జి పై నుంచి కిన్నెరసాని వాగులో పడింది ఓ ట్రాలీ వాహనం. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. 

వాహనం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా  ఏలూరు జిల్లా(ఏపీ) నర్సాపురం మండలం తిరుమల దేవి పేట కు చెందిన వాళ్లు.  భద్రాచలం రామాలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది.

ఇదీ చదవండి: మళ్లీ వస్తా అని చెప్పి కానరాని లోకాలకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement