
అనకాపల్లి: జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు వందల సంఖ్యలో బీరు కేసులు నేలపాలయ్యాయి.
సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఒకవైపు బోల్తా పడిన విషయాన్నే పక్కకు పెట్టేసి మరీ చేతికి దొరికిన బీరు బాటిల్స్‌ను పట్టుకుని పారిపోయారు. బీర్లు సీసాల కోసం జనం పాట్లు పడుతూ ఇలా అందినకాడికి పట్టుకుపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలను పట్టుకెళితే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment