టాటా ఏస్ గోల్డ్ మినీ ట్రక్కు
సాక్షి, ముంబై: దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ టన్ను మినీ ట్రక్ విభాగంలో కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. టన్ను కెపాసిటీ మినీ ట్రక్కు విభాగంలో మేజర్ వాటాను దక్కించుకున్న సంస్థ తాజాగా తొలి నాలుగు చక్రాల మినీ ట్రక్కును విడుదల చేసింది. టాటా మోటర్స్ అధీకృత డీలర్షిప్‌ల ద్వారా త్వరలోనే అమ్మకానికి అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా ఏస్ గోల్డ్ పేరుతో లాంచ్ చేసిన దీని ధరను 3.75లక్షల రూపాయలుగా నిర్ణయించింది.
టాటా ఏస్ గోల్డ్ వాహనంలో మెరుగుపర్చిన ఫీచర్లను ప్రవేశపెడుతున్నామని టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపార శాఖ అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. తద్వారా తమ వినియోగదారులను మరింత ఆకట్టుకోనున్నట్టు అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు 24గంటలూ మరమ్మత్తు సేవలను , ఉచిత బీమా, సమయానికి రిపేర్ కమిట్‌మెంట్ లాంటి ఇతర విలువైన సేవలను ఏస్ గోల్డ్ కస్టమర్లకు అందించ నున్నామని పేర్కొన్నారు. కాగా 2005 లో విడుదల చేసిన టాటా ఏస్ 'ఛోటా హాథీ' గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మిని ట్రక్ సెగ్మెంట్‌లో 68 శాతం వాటాతో గత13 ఏళ్లుగా 20లక్షల యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment