- ఆరుగురు దుర్మరణం 11 మందికి గాయూలు
- టాటా ఏస్‌ను ఢీకొన్న బొగ్గు టిప్పర్
కోల్‌సిటీ/మొగుళ్లపల్లి : గోదావరిఖనిలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన 25 మంది ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. వీరు ప్రయూణిస్తున్న టాటా ఏస్ ట్రాలీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్రగాయూలు కాగా, గోదావరిఖని, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. స్థానిక సింగరేణి పవర్‌హౌస్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన బండారి మల్లయ్య కొన్నేళ్లుగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని న్యూపోరట్‌పల్లిలో ఉంటున్నాడు.
ఆయన శుక్రవారం ఉద యం మృతి చెందగా, అంత్యక్రియలకు కుర్కిశాల గ్రామానికి చెందిన బంధువులు టాటా ఏస్ ట్రాలీలో వచ్చా రు. గోదావరి ఒడ్డున సాయంత్రం అంత్యక్రియలు పూర్తరుున తర్వాత తిరిగి వారు స్వగ్రామానికి అదే వాహనంలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వాహనం దారి తప్పింది. గోదావరిఖని నుంచి మంథని మీదుగా కుర్కిశాల వెళ్లేందుకు రాజీవ్ రహదారిపైకి వచ్చారు. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కార్నర్ వద్ద టర్న్ కావాల్సి ఉండగా, దారి తెలియక మంచిర్యాల వైపు వెళ్లిపోయారు. గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత తాము దారి తప్పామని గమనించి స్థానికులను అడిగి వాహనాన్ని వెనక్కు మళ్లించారు.
స్థానిక గంగానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి మంథని వైపు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా బొగ్గు టిప్పర్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. అందులో ఉన్న బండారి అనిల్(15), బండారి కుమార్(25), ఆశడపల్లి చిన్నన్న(60), మ్యాదరబోయిన అయిలయ్య(55) అక్కడికక్కడే మృతిచెందారు. స్థాని కులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బండారి లక్ష్మీ(40), అప్పం సమ్మయ్య(45) ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, 8 మందికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కలచివేసిన క్షతగాత్రుల ఆర్తనాదాలు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న, బండారి నాగమల్లు, కేతమ్మ, అప్పం రాజఅయిలయ్య, బండారి ప్రశాంత్, బండారి రాధ, బండారి పుష్ప, బండారి అయిలమ్మ, కొమురక్క తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. ఒకవైపు క్షతగాత్రులు రోదనలు, మరోవైపు మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. మృతుల్లో అప్పం సమ్మయ్య మాజీ సర్పంచ్. వాహ నం డ్రైవర్ మేకల కుమార్‌తోపాటు క్యాబిన్‌లో కూర్చున్న మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పరామర్శించారు.
చావుకు వెళ్లొస్తూ..
Published Sat, Jun 6 2015 5:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement