కోల్‌కతా: మొత్తం మూడు ఏనుగులు కలిసి ట్రాక్ దాటుతున్నాయి. ఇంతలో ఓ గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి దూసుకొచ్చింది. వేగంగా గజరాజులను ఢీ కొట్టడంతో అవి కిందపడి మృతి చెందాయి. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్ జిల్లా రాజభక్తావ అటవీ ప్రాంతంలో జరిగింది.
అలీపూర్‌ద్వార్ నుంచి సిలిగురి వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఏనుగులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు.
సంఘటన జరిగిన రాజభక్తావ-కాల్చిని సెక్షన్‌లో రైలు ఢీకొట్టడాన్ని నిరోధించే ఇన్‌స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్(ఐడీఎస్) ఇంకా అందుబాటులోకి రాలేదని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడ ఐడీఎస్ వ్యవస్థ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను రైళ్లు ఢీకొన్న సంఘటనలు జరగలేదని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment