collided
-
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
పెళ్లి ఇంట విషాదం
జగిత్యాల: ఆర్టీసీ బస్సు కారు ను ఢీకొన్న సంఘటనలో నవవధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన వలిపిరెడ్డి రాజమల్లు, లక్ష్మి కూతురు సంఘవి పెళ్లి ఈనెల 8న జనగామకు చెందిన ఓ యువకుడితో హన్మకొండలో జరిగింది.శనివారం రాత్రి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న సంఘవి సోదరుడు సంకీర్తన్ (30), హైదరా బాద్‌లో సంఘవితో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన సాధు మునిరాజీ (25)తోపాటు తల్లి లక్ష్మి, తండ్రి రాజమల్లు కారులో జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్ సమీపంలోకి రాగానే జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వీరి కారును ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సంకీర్తన్తోపాటు మునిరాజీ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మి, రాజమల్లు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంకీర్తన్ మేనమామ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పెళ్లైన రెండురోజులకే సోదరుడితో పాటు స్నేహితురాలు మృతి చెందడంతో సంఘవి తీవ్రంగా రోదించింది. గాయాలతోనే ఉన్న తండ్రి రాజమల్లు సంకీర్తన్ చితికి నిప్పంటించడం స్థానికులను కలచివేసింది. -
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్‌లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
రెండు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
చంద్రగిరి/హనుమాన్‌జంక్షన్ రూరల్: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు తన భార్య నీరజకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ)కు తీసుకువెళ్లేందుకు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ సమీర్(26)తో కలిసి ఆదివారం రాత్రి కారులో బయలుదేరారు. వారితోపాటు శ్రీనివాసులు అన్న శేషయ్య(49), ఆయన భార్య జయంతి(43) కూడా ఉన్నారు.మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మ(56)ను సైతం వీరు కారులో ఎక్కించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.40గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు సమీర్, పద్మావతమ్మ, జయంతి, శేషయ్య అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, నీరజలకు తీవ్ర గాయాలపాలయ్యారు. చంద్రగిరి సీఐ రామయ్య తన సిబ్బందితో కలసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారిద్దరినీ 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలంలోనే నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద... కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా వేదసంతూర్కు చెందిన స్వామినాథన్ తన కుటుంబంతో కలిసి పదేళ్లుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అడ్వొకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న స్వామినాథన్ తమిళనాడులోని సొంతూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన కారును మితిమీరిన వేగంతో నడపటంతో కోడూరుపాడు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను దాటుకుని అవతల వైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్వామినాథన్(40), ఆయన కుమార్తె రాధాప్రియ(14), కుమారుడు రాకే‹Ù(12), సోదరుడి కుమారుడు గోపి(23) అక్కడికక్కడే మృతిచెందారు. స్వామినాథన్ భార్య సత్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్ సీఐ అల్లు నవీన్ నరసింహామూర్తి, వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గన్నవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మంది గాయపడ్డారు. 102 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే బీజింగ్‌లో మెట్రో రైళ్లు క్షణం గడువు లేకుండా నడుస్తుంటాయి. నగరంలో 27 రైల్వే లైన్లలో ప్రతిరోజూ 13 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు నిమిషాలకో రైలు నడుస్తుంది. బీజింగ్‌లో శుక్రవారం భారీగా మంచు కురిసింది. రైల్వే ట్రాక్‌లు తడిసి ఉన్నాయి. ఈ క్రమంలో సబ్వే వద్ద ఓ రైలు బ్రేక్ వేసింది. వెనకనే వస్తున్న రైలు బ్రేక్ వేయడంలో విఫలమైన నేపథ్యంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడిపోయామని స్థానికులు తెలిపారు. కొందరు ఎముకలు విరిగి ఆర్తనాదాలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 515 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించారు. 102 మందికి ఎముకలు విరిగి పరిస్థితి తీవ్రంగా ఉందని వెైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి -
ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను..
కోల్‌కతా: మొత్తం మూడు ఏనుగులు కలిసి ట్రాక్ దాటుతున్నాయి. ఇంతలో ఓ గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ పై నుంచి దూసుకొచ్చింది. వేగంగా గజరాజులను ఢీ కొట్టడంతో అవి కిందపడి మృతి చెందాయి. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ జిల్లా రాజభక్తావ అటవీ ప్రాంతంలో జరిగింది. అలీపూర్‌ద్వార్ నుంచి సిలిగురి వెళుతున్న ఖాళీ గూడ్స్ రైలు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఏనుగులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చనిపోయిన మూడు ఏనుగుల్లో రెండు చిన్న ఏనుగులేనని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సంఘటన జరిగిన రాజభక్తావ-కాల్చిని సెక్షన్లో రైలు ఢీకొట్టడాన్ని నిరోధించే ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్(ఐడీఎస్) ఇంకా అందుబాటులోకి రాలేదని నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ఇక్కడ ఐడీఎస్ వ్యవస్థ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను రైళ్లు ఢీకొన్న సంఘటనలు జరగలేదని అధికారులు చెప్పారు. ఇదీచదవండి..ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది! -
ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వస్తే ఇంకేమైనా ఉందా. ఇక అంతే సంగతలు. ఐతే కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగా నేపాల్‌కి చెందిన రెండు విమానాలు ఎదురు పడి డీ కొనేంత చేరువులోకి వచ్చేశాయి. అయితే పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో నేపాల్ విమానాయన అథారిటీ సీరియస్ అయ్యింది. కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగానే జరిగిందని నిర్థిరిస్తూ.. ముగ్గురు కంట్రోలర్లపై వేటు విధించింది. వివరాల ప్రకారం..శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ 320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీ కొనేంత చేరువకు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం దాదాపు 19 వేల అడుగుల నుంచి దిగుతుండగా..అదే ప్రదేశంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్ చూపించడంతో వార్నింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు సదరు విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం ఏడు వేల అడుగులకు దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అదికారులు ఊపించుకున్నారు. గానీ ఈ ఘటన పట్ల సీరియస్ అయిన నేపాల్ పౌర విమానాయన అథారిటీ ఇది ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడూ కంట్రోల్ రూంకు ఇన్చార్జ్గా ఉన్న ముగ్గురు అధికారులను సీఏఏఎన్ సస్పెండ్ చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. (చదవండి: చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష) -
దొంగల దుశ్చర్య: కారును బైక్‌తో ఢీకొట్టి..వెంబడించి..
సాక్షి, బనశంకరి: బెంగళూరు నగరంలో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు బైక్‌పై ఓ కారును ఢీకొట్టి వారిని ఐదు కిలోమీటర్లు వెంబడించారు. ఈ ఘటనతో కారులో ఉన్న దంపతులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సర్జాపుర రోడ్డులో దంపతులు కారులో ఇంటికి వెళ్తున్నారు. ఎదురుగా బైక్‌లో వచ్చిన వ్యక్తులు అదే పనిగా కారును ఢీకొట్టాడు. డ్యాష్‌బోర్డులో ఉన్న కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. అనంతరం బైక్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కారు వద్దకు వెళ్లి దంపతులను కిందకు దిగాలని అడిగాడు. వారు నిరాకరించడంతో కిటికీ అద్దాలపై కొట్టాడు. దీంతో వారు రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుండగా ఐదు కిలోమీటర్లు బైక్‌లో వీరి వాహనాన్ని వెంబడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నగర ప్రజలకు రక్షణ లేదనే విషయం అవగతమవుతోందని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్జాపుర రోడ్డు సోపాస్ మోర్ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్ల పక్కన విద్యుత్ దీపాలు అమర్చి గస్తీ పెంచాలని నెటిజన్లు నగర ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తూర్పువిభాగ ట్రాఫిక్ డీసీపీ కళాకృష్ణస్వామి తెలిపారు. Horrific incident reported on Sarjapur road near Sofas & More around 3 am today. Miscreant riders collided purposefully to a couple traveling in car. They chased the car for 5km till their society in Chikkanayakanahalli. Don't open your car in night. Use dash cam. @BlrCityPolice. pic.twitter.com/4QVYtBZ67B — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) January 29, 2023 (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
పోలీసును ఢీకొట్టి పరారైన కారు డ్రైవర్
-
అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా
వాషింగ్టన్: రోదసిలో అంతుచిక్కని దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా పరిశోధకులు అంతరిక్షం లో జరిగిన దృగ్విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. రోదసిలో న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన సుమారు 900 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. న్యూట్రాన్ స్టార్ , బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడాన్ని పరిశోధకులు తొలిసారిగా గమనించారు. జూన్ 5 2020 నుంచి జూన్ 15 2020 మధ్యలో ఏకంగా సుమారు పది సార్లు ఢీ కొట్టుకున్నాయని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకోవడం తో బలమైన గురుత్వాకర్షణ తరంగాలు ఉధ్బవిం చాయని పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన రెండు దృగ్విషయాలు ఢీ కొట్టుకోవడం తో బైనరీ వ్యవస్థల మూలాలు, అవి ఎంత తరచుగా విలీనం అవుతాయనే విషయాలను తెలుసుకోవడంలో, ఉపయోగ పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు -
బైక్ లారీ ఢీ ముగ్గురు యువకులు మృతి
-
ట్రావెల్స్ బస్సు పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, వ్యాన్ ఢీ..ఒకరి మృతి
కృష్ణా జిల్లా : నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుతోంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చెట్టును ఢీకొన్న బైక్..ఇద్దరి మృతి
వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్(29), పల్లె ప్రభాకర్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
స్కూల్ బస్సు, ట్యాంకర్ ఢీ
భూత్పూర్ (దేవరకద్ర): బడి ముగించుకుని ఆడుతూ పాడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. ఏం జరి గిందో తెలియదు.. పెద్ద శబ్ధం.. అద్దాలు పగిలిపోయి గాజుపెంకులు కళ్లకు తగులుకుంటూ వెళ్లాయి. భయాందోళనలతో ఒకటే అరుపులు కేకలు.. కానీ ఎవరికీ ఏం కాలేదు.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. ఇంతకు ఏం జరిగిందంటే భూత్పూర్ మండలం అమి స్తాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. రెండు వాహనాల వేగం బాగానే ఉండటంతో స్కూల్ బస్సు డ్రైవర్ సుల్తాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పిల్లలంతా వెనకసీటుల్లో కూర్చోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణాలు.. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల్లో భాగంగా రోడ్డును సగం తొలగించి పైప్‌లైన్ పనులు చేపట్టారు. పనులు ఇంకా పూర్తికాక నిర్వాహకులు రోడ్డును డైవర్షన్ చేశారు. దీంతో వాహనాలు ఒకే దారిలో వెళ్లాల్సి వస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వైపుకు వస్తున్న హిరా మోడల్ స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సుల్తాన్ సీటు లో ఇరుక్కుపోయాడు. దారిగుండా వెళ్తు న్న వాహనదారులు, గ్రామస్తులు వెంట నే డ్రైవర్‌ను బయటకు లాగి అంబు లెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పంకజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌కు రక్తగాయాలు కావడంతో అంకుల్.. అంటూ కేకలు పెట్టారు. గమనించిన అమిస్తాపూర్ వాసులు విద్యార్థులను బస్సులోంచి దించి సముదాయించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం వెంటనే అక్కడికి వచ్చి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆందోళనకు గురైన విద్యార్థులు నోటీసులు జారీ చేశాం పనులు త్వరితగతిన పూర్తికాకపోవడంతో గతంలో పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తూ అధికారులు, కాంట్రాక్టర్ పనితీరును తప్పుపట్టారు. ఇదిలాఉండగా ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాస్ స్పందించారు. గతంలో రోడ్డు డ్రైవర్షన్ను త్వరగా తొలగించాలని ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోవడంతో పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఇకనైనా పనులు వేగంగా చేసి డైవర్షన్ తొలగించాలని కోరారు. -
బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి
శాయంపేట(భూపాలపల్లి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ముల్కనూరి శ్రీనివాస్(35), రేణుకుంట్ల సాంబయ్య మండల కేంద్రంలో మేస్త్రీ పనులు చూసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై మైలారం మీదుగా పెద్దకోడెపాక గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో రేగొండ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన శ్రీపతి నరేశ్(25), పాలకుర్తికి చెందిన నల్ల సురేష్ మరో ద్విచక్ర వాహనంపై పెద్దకోడెపాక మీదుగా మైలారం గ్రామానికి వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మైలారం శివారులో మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముల్కనూరి శ్రీనివాస్, శ్రీపతి నరేశ్, రేణుకుంట్ల సాంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముల్కనూరి శ్రీనివాస్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీపతి నరేశ్ మృతిచెందాడు. సాంబయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పగాయాలైన సురేశ్ హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన సీఐ
మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో అంబర్ పేట్ ట్రైనింగ్ సీఐ గిరీష్ రావు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో తన ఇన్నోవా కారు(ఏపీ 10ఎస్ 6678)తో దారిన పోతున్న పాదచారులను ఢీకొన్నాడు. ఈ ఘటనలో బిక్షపతి, సత్య లక్ష్మీ అనే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. సీఐ గిరిష్ రావుపై సెక్షన్-337,338,185 మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకుని సీఐని రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో కారు నడిపి జనాలను గాయపరించినందుకు గానూ సీఐ గిరీష్ రావును సస్పెండ్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. -
కారును ఢీకొన్న బస్సు: ఏడుగురు మృతి
-
లారీ,బైక్ ఢీ : యువకుడికి తీవ్రగాయాలు
యాచారం: లారీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం చింతుల్ల గ్రామానికి చెందిన ఎదటి నవీన్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష విరమించేందుకు కావాల్సిన పండ్లకొనుగోలుకు తన బైక్‌పై యాచారం వెళు్తన్నారు. మార్గ మధ్యలో యాచారం– చౌదర్పల్లి గ్రా మాల మధ్య మలుపు వద్ద యాచారం నుంచి చౌదర్‌పల్లికి వస్తున్న లారీ నవీన్ కుమార్ బైకును బలంగా ఢీకొట్టడంలో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నవీన్ కుమార్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ మదన్ మోహన్ రెడ్డిని సంప్రదించగా ప్రమాదం వాస్తవమేకానీ ఫిర్యాదు అందలేదన్నారు. -
లారీ - బైక్ ఢీ ఒకరు మృతి
-
ఆయిల్ ట్యాంకర్, కళాశాల బస్సు ఢీ
విద్యార్థులకు స్వల్ప గాయాలు తప్పిన పెను ప్రమాదం ఆర్టీఏ జంక్షన్లో ఘటన మామునూరు : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను వెనక నుంచి ఓ కళాశాల బస్సు ఢీకొట్టిన ఘటన నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని ఆర్టీఏ జంక్షలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 5వ డివిజన్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు హన్మకొండలో సుమారు 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు బయల్దేరింది. ఈ క్రమంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడుపెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీఏ జంక్షన్‌కు బస్సు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పి డీజిల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో విద్యార్థులు స్వల్పగాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ వెనుక భాగం పాక్షికంగా ధ్వంసం కాగా బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి ఆటోల్లో ఆస్పత్రికి తరలివెళ్లగా మరికొందరు విద్యార్థులు వాహనాలపై కళాశాలకు వెళ్లారు. ఒకవేళ ఈ ప్రమాదంలో నిండుగా ఉన్న డీజిల్ ట్యాంకర్ గనుక పగిలి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే అదుపు తప్పిందని డ్రైవర్ తెలిపారు. మామునూరు పోలీసులు చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు వాగ్దేవి కళాశాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు. -
పోలీస్ జీపును ఢీ కొన్న లారీ
కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు..చేయి తొలగింపు స్వలంగా గాయపడిన ఏఎస్ఐ, హోంగార్డు సత్తుపల్లి : పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్జీపును మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని లారీ ఢీకొన్న సంఘటనలో ఒక కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వలంగా గాయపడ్డారు. సీఐ పి.రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం..మండల పరిధిలోని తాళ్లమడ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ జీపును గుర్తు తెలియని లారీ సైడ్ నుంచి వేగంగా ఢీకొని వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ ఉమర్ కుడిచేయి నుజ్జునుజ్జు అయ్యి మాంసం ముద్దలు జీపులో పడ్డాయి. దీంతో జీపు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. జీపులో ఉన్న ఏఎస్సై రాజుకు తలకు గాయమైంది. హోంగార్డు కె.అశోక్ చేయి విరిగింది. విషయం తెలుసుకున్న సీఐ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం ఉమర్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చేయి తొలగించారు. ఏఎస్సై రాజు, హోంగార్డు అశోక్‌కు చికిత్స నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాలకు సమాచారం అందించారు. గాయపడిన ఉమర్ చేయి తొలగించాల్సి రావడంతో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉమర్‌కు వివాద రహితుడిగా మంచిపేరు ఉంది. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా క్రైం కేసుల్లో చురుగ్గా వ్యవహరించి పలు మార్లు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. -
బైక్, ట్రాక్టర్ ఢీ : ముగ్గురి మృతి
దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. దెందులూరు మండలం సోమవరప్పాడు సమీపంలో బైక్, ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
డీసీఎం, ఆర్టీసీ బస్సు ఢీ
చిట్యాల: నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొంది. దీంతో డీసీఎం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దానిని ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయరహదారిపై గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు -
విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్
బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానాన్ని అనుమానిత డ్రోన్ ఢీకొట్టింది. యూరోప్‌లోనే చాలా రద్దీగా ఉండే విమానాశ్రయమైన హిత్రూ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. 137 మంది ప్రయాణికులు, విమానసిబ్బందితో ఎయిర్ బస్ ఏ320 విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్, విమానాన్ని ఢీకొట్టినట్టు గమనించిన పైలెట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం సురక్షింతంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే సిబ్బంది తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి హాని జరగకపోవడంతో మరుసటి ప్రయాణానికి ఎయిర్ బస్ ఏ320 బయలుదేరింది. అయితే గడచిన మూడు నెలల్లో యూకేలోనే ఇలాంటివి 23 సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు, ఢ్రోన్లను ఢీకొంటే కలిగే తీవ్రపరిణామాల గురించి తెలియని వారే ఎదో సరదా కోసం ఇలా చేస్తున్నారని బ్రిటీష్ పైలట్స్ అసోసియేషన్ అధికారి స్టీవ్ లాండెల్స్ తెలిపారు. విమానానికి దగ్గరగా డ్రోన్లను తీసుకురావడం చట్ట పరంగా నేరమని పేర్కొన్నారు. -
పాఠశాల బస్సును ఢీకొన్న ట్రాలీ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలో ట్రాలీ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ పాఠశాల బస్సు రోడ్డు పక్కనున్న వాలులోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్ గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ పాఠశాల బస్సు 42 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం బుట్టాయగూడెం మండలం గంగవరం నుంచి స్కూలుకు బయలుదేరింది. పట్టెన్నపాలెం, శ్రీనివాసపురం మీదుగా స్థానిక రాష్ట్ర ప్రధాన రహదారిపైకి చేరుకుంది. గరుఢపక్షి నగర్లోకి మలుపు తిరుగుతుండగా.. కోదాడ నుంచి ఒరిస్సాకు సిమెంటు లోడుతో వెళుతున్న ట్రాలీ వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో పాఠశాల బస్సు రోడ్డుపక్కన ఉన్న లోతైన వాలులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గంగవరానికి చెందిన విద్యార్ధులు పి.దుర్గాప్రసాద్, పి.భావన, ఆర్.రేవతి, జి.సాయికుమార్, జి.హరిచందన, పట్టెన్నపాలెంకు చెందిన జి.వీరాంజనేయులు, బి.హర్షనందు, టి.భీష్మవెంకటసాయిచందు, టి.ఝాన్సీ, శ్రీనివాసపురానికి చెందిన ఎలికే ఈశ్వర శ్రీనాథ కిషోర్, పోల్నాటి తారక్, పోల్నాటి హైమావతి, పట్టణానికి చెందిన జి.నవదీప్, కె.భవ్యనాగార్షిత గాయపడ్డారు. బస్సు డ్రైవర్ దొండపాటి ఇజ్రాయేల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థుల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి తనయుడు పోల్నాటి తారక్ ఉండడంతో ఆయన హుటాహుటిన కారులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కుమారునితోపాటు మరికొందరు పిల్లలను కారులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కూడా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డి.భాస్కరరావు పర్యవేక్షణలో వైద్యులు విద్యార్థులకు చికిత్స చేశారు. ఆరుగురు విద్యార్థులకు ఓ మోస్తరుగా గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ ఇజ్రాయేల్ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏరియా ఆస్పత్రికి ఉరుకులు పరుగుల మీద తరలివచ్చారు. దీంతో ఆస్పత్రి ఆవరణ రోదనలతో మిన్నంటింది. చికిత్స పూర్తయిన తర్వాత తమ పిల్లలను వారు ఇళ్లకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీని, దాని డ్రైవర్ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురి పరామర్శ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పలువురు పరామర్శించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, పీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు, కరాటం రాంబాబు, వైఎస్సార్ సీపీ అధికారప్రతినిధి పోల్నాటి బాబ్జి, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తిరామ్కుమార్, కాంగ్రెస్ నాయకులు పీపీఎన్ చంద్రరావు, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, డీవైఈవో తిరుమలదాసు, ఎంఈవో ఆర్.రంగయ్య , బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, సీపీఐ నాయకులు బూరుగుపల్లిసూరిబాబు, పాఠశాల కరస్పాండెంట్ పి.సతీష్ చంద్, ఆయా పాఠశాలల ప్రతినిధులు పరామర్శించారు. -
రెండు బస్సులు ఢీ : 15 మందికి గాయాలు
బాసర: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాసరలోని శాంకారి పాఠశాల సమీపంలో భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదే మార్గంలో వెళ్తున్న పల్లెవెలుగు బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
రెండు బైక్‌లు ఢీ.. ఐదుగురికి గాయాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ మండలం మందపల్లి, నాగాపూర్ గ్రామాల మధ్య రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోశన్న, లక్ష్మి దంపతులు, వారి కుమారుడు రవితేజతోపాటు వేరొక బైక్‌పై ప్రయాణిస్తున్న అరికెల లక్ష్మణ్, చెప్పాల భూమేశ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్టీసి బస్సు ఢీ : కానిస్టేబుల్ మృతి
ఆత్మకూరు: అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. ఆత్మకూరు మండలంలోని పీఏబీఆర్ కెనాల్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో గుడుదప్ప (50) అనే కానిస్టేబుల్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పీఏబీఆర్ కెనాల్ నుంచి రైతులు గండి కొట్టి నీటిని తరలిస్తున్నారని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురంకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గుడుదప్ప గత పది రోజుల నుంచి కెనాల్ వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నాడు. బుధవారం గుడుదప్ప కాలువను పరిశీలించి అటు వైపుగా స్కూటీపై వెళ్తుండగా కళ్యాణదుర్గం నుంచి అనంతపురంకు వెళ్లే కడప ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అతని తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం సంఘటనా స్థలానికి ఏఆర్ డీఎస్పీ అక్కడకు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బస్సు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బైకును ఢీకొట్టిన లారీ - ఇద్దరి మృతి
బైక్ పై వెళుతున్న వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టిన ఘనటలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నకిరికల్లుకు చెందిన మధు, లక్ష్మీనారాయణ ఈ ప్రమదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పుణేలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బస్సును ఢీకొన్న డంపర్, మరో వాహనం సాక్షి, ముంబై: పుణేలో రహదారి రక్తమోడింది. దేహు-కాత్రజ్ రోడ్డు మలుపులోని వడ్గావ్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వడ్గావ్ బ్రిడ్జిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ డంపర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొన్నది. ఈ ఘటనలో బస్సు కూడా మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో వెనకాల వస్తున్న మరో రెండు మోటర్‌సైకిళ్లు ప్రమాదంలో చిక్కుకుపోయాయి. ఘటన స్థలంలోనే నలుగురు మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మృతులు సాతారా జిల్లా జావలీ గ్రామానికి చెందిన సుభాశ్ చౌదరి, బాలాజీ రాథోడ్, రవీంద్ర సావంత్, సారిక, రేవతి సావంత్, గైక్వాడ్ మహంబర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డంపర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన అనంతరం దేహు-కాత్రజ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించిపోయింది. -
చావుకు వెళ్లొస్తూ..
- ఆరుగురు దుర్మరణం 11 మందికి గాయూలు - టాటా ఏస్‌ను ఢీకొన్న బొగ్గు టిప్పర్ కోల్‌సిటీ/మొగుళ్లపల్లి : గోదావరిఖనిలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామానికి చెందిన 25 మంది ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. వీరు ప్రయూణిస్తున్న టాటా ఏస్ ట్రాలీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్రగాయూలు కాగా, గోదావరిఖని, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. స్థానిక సింగరేణి పవర్‌హౌస్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన బండారి మల్లయ్య కొన్నేళ్లుగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని న్యూపోరట్‌పల్లిలో ఉంటున్నాడు. ఆయన శుక్రవారం ఉద యం మృతి చెందగా, అంత్యక్రియలకు కుర్కిశాల గ్రామానికి చెందిన బంధువులు టాటా ఏస్ ట్రాలీలో వచ్చా రు. గోదావరి ఒడ్డున సాయంత్రం అంత్యక్రియలు పూర్తరుున తర్వాత తిరిగి వారు స్వగ్రామానికి అదే వాహనంలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వాహనం దారి తప్పింది. గోదావరిఖని నుంచి మంథని మీదుగా కుర్కిశాల వెళ్లేందుకు రాజీవ్ రహదారిపైకి వచ్చారు. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కార్నర్ వద్ద టర్న్ కావాల్సి ఉండగా, దారి తెలియక మంచిర్యాల వైపు వెళ్లిపోయారు. గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత తాము దారి తప్పామని గమనించి స్థానికులను అడిగి వాహనాన్ని వెనక్కు మళ్లించారు. స్థానిక గంగానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి మంథని వైపు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా బొగ్గు టిప్పర్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. అందులో ఉన్న బండారి అనిల్(15), బండారి కుమార్(25), ఆశడపల్లి చిన్నన్న(60), మ్యాదరబోయిన అయిలయ్య(55) అక్కడికక్కడే మృతిచెందారు. స్థాని కులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బండారి లక్ష్మీ(40), అప్పం సమ్మయ్య(45) ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, 8 మందికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కలచివేసిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న, బండారి నాగమల్లు, కేతమ్మ, అప్పం రాజఅయిలయ్య, బండారి ప్రశాంత్, బండారి రాధ, బండారి పుష్ప, బండారి అయిలమ్మ, కొమురక్క తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో బందాల శ్రీనివాస్, చేరాలు, సాయన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. ఒకవైపు క్షతగాత్రులు రోదనలు, మరోవైపు మృతుల బంధువుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. మృతుల్లో అప్పం సమ్మయ్య మాజీ సర్పంచ్. వాహ నం డ్రైవర్ మేకల కుమార్‌తోపాటు క్యాబిన్లో కూర్చున్న మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పరామర్శించారు. -
స్కూల్ బస్-లారీ ఢీ
ఆదిలాబాద్: స్కూల్ బస్-లారీని ఢీ కొన్న సంఘటనలో క్లీనర్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాలలోని వెంపల్లిలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. మంచిర్యాల నుంచి గుడిపేటకు విద్యార్థులను తీసుకవచ్చేందుకు వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సమయంలో స్కూల్ బస్‌లో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం
► మునగాల మండలం ఆకుపాములలో ఘటన ► బస్సు అద్దాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు ► పరారీలో బస్సుడ్రైవర్, ఆయా ఆకుపాముల(మునగాల): స్కూల్ బస్సు ఢీకొని ఓ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండలంలోని ఆకుపాములలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కేశగాని శ్రీనివాస్, ఉమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిప్రియ(4) శివారులో గల బెతానియా పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రోజుమాదిరిగానే స్కూల్‌కు చెందిన బస్సులో శనివారం పాఠశాలకు వెళ్లింది. ఈ గ్రామంలో 20మంది విద్యార్థులు ఇదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. సాయింత్రం బస్సులో పాఠశాలకు చెందిన 15మంది విద్యార్థులను బస్సులో తీసుకువచ్చిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, ఆయా అనితలు ఆకుపాముల ఎస్బీఐ బ్రాంచి ఎదుట తొమ్మిది మంది విద్యార్థులను దిం చివేశారు. వీరిలో రిషిప్రియ బస్సు దిగి, నడుచుకుంటూ వెళ్తోంది. డ్రైవర్ గుర్తించకుండా బస్సును ముందుకు కదిలించడంతో రిషిప్రియపై నుంచి చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో డ్రైవర్, ఆయాలు బస్సును వదలి పారిపోయారు. ఆగ్రహంతో గ్రామస్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటన స్థలా నికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి బస్సును అక్కడి నుంచి తరలించారు. -
ఆటో బైక్ ఢీ... ఒకరికి గాయాలు
కురుపాం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని శోభలతాదేవి కాలనీ సమీపంలో ఆదివారం ఓ ఆటో బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐ.చంద్రశేఖర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు... కురుపాంలోని కేఎన్బీ తోటలో ఆదివారం వైశ్యసంఘం వన భోజన కార్యక్రమం నిర్వహించారు. శివ్వన్నపేటకు చెందిన చంద్రశేఖర్ ఈ వన భోజనానికి హాజరై తిరిగి తన ద్విచక్ర వాహనంపై కురుపాం వస్తుండగా... శోభలతాదేవి కాలనీ సమీపంలో కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వైపు వేగంగా వెళుతున్న ఆటో బైక్‌ను ఢీకొంది. దీంతో చంద్రశేఖర్ తలకు గాయమైంది. అలాగే కుడిచేయి విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి కె.మనోజ్‌కుమార్ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ మేరకు కురుపాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
ఆటో, ట్రాక్టర్ ఢీ : ఇద్దరికి గాయాలు
గుణానపురం(కొమరాడ), న్యూస్‌లైన్ : మండలంలోని గుణానపురం సమీపంలో శనివారం ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జంఝావతి నుంచి గుణానపురానికి నీటి క్యాన్ల లోడుతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ మలుపు వద్ద ఢీకొన్నాయి. దీంతో ఆటో నడుపుతున్న కోల అనిల్, జి.త్రినాథ్లకు గాయాలయ్యాయి. ఆటో ముందుభాగం నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు పార్వతీపురం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం రిఫర్ చేశారు. -
మినీ వ్యాన్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్
వెల్లమిల్లి (ఉంగుటూరు), న్యూస్‌లైన్: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ బస్ మినీ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బస్ డ్రైవర్ వీకేఎన్ స్వామి గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా కొమ్మర వెళుతున్న మినీ వ్యాన్‌ను విజయవాడ నుంచి తణుకు వెళుతున్న బైపాస్ ఎక్స్‌ప్రెస్ వెల్లమిల్లి వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మినీ వ్యాన్ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై భారీ గోతులు ఉండడంతో వాటిలో పడిందని, పక్కకు తిప్పేందుకు ఆస్కారం లేకపోవడంతో ఢీ కొట్టినట్లు ప్రయాణికులు, స్థానికులు తెలిపారు. చేబ్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సారంగాపూర్, న్యూస్‌లైన్ : కమ్మునూర్ శివారులో గురువారం సాయంత్రం ట్రాలీఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ధర్మపురి నుం చి కమ్మునూర్ మీదుగా మంగే ళ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ జిల్లా కలమడుగు నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రాలీ ఆటోను కమ్మునూర్ శివారులో ఢీకొట్టింది. ట్రాలీ వెనుక నిల్చున్న మ్యాదరవే ని గంగమల్లు (60) తలకు ఇనుపచువ్వలు గుచ్చి ట్రాలీలో పడిపోయాడు, తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న పెద్దగొల్ల మల్లేశ్, సల్ల రాజన్న, జక్కుల చంద్రయ్య, చెర్ల సత్తయ్య, ట్రాలీ డ్రైవర్ బుడిగె శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడితోపాటు, గాయపడ్డ నలుగురి స్వగ్రామం మండలంలోని కొ ల్వాయి. డ్రైవర్ జగిత్యాలకు చెందినవాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై గంగారెడ్డి సందర్శించి గాయపడ్డవారిని 108లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.