
లారీ,బైక్ ఢీ : యువకుడికి తీవ్రగాయాలు
యాచారం: లారీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం చింతుల్ల గ్రామానికి చెందిన ఎదటి నవీన్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష విరమించేందుకు కావాల్సిన పండ్లకొనుగోలుకు తన బైక్‌పై యాచారం వెళు్తన్నారు. మార్గ మధ్యలో యాచారం– చౌదర్‌పల్లి గ్రా మాల మధ్య మలుపు వద్ద యాచారం నుంచి చౌదర్‌పల్లికి వస్తున్న లారీ నవీన్ కుమార్ బైకును బలంగా ఢీకొట్టడంలో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నవీన్ కుమార్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ మదన్ మోహన్ రెడ్డిని సంప్రదించగా ప్రమాదం వాస్తవమేకానీ ఫిర్యాదు అందలేదన్నారు.